ప్రస్తుత తరుణంలో మనకు ఆధార్ ఎంత అవసరం ఉందో ఇప్పుడు పాన్ కార్డు యొక్క అవసరం కూడా ఉంది. ప్రతి చిన్న పనికి మనం బ్యాంకుల ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఈ కార్డు ఉంటే తప్ప బ్యాంకులో కొత్త ఖాతా పొందే అవకాశం లేదు. అలాగే భూముల రిజిస్ట్రేషన్, కొన్ని పథకాలకు కూడా ఆధార్ తో పాటు పాన్ ని ప్రభుత్వాలు తప్పని సారి చేస్తున్నాయి. అందుకే ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే ఈ కార్డు ఇప్పుడు కీలకంగా మారింది. అయితే ఇప్పుడు పాన్ కార్డు పొందటం చాలా సులభం. ఇప్పుడు ఇంట్లో కూర్చునే కొత్త పాన్ కార్డు కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ఇంకా చదవండి: వాహనదారులకు శుభవార్త చెప్పిన కేంద్రం
స్టెప్ 1: ఆన్‌లైన్‌లో కొత్త పాన్ కోసం ధరఖాస్తు చేసుకోవడానికి అధికారిక ఎన్‌ఎస్‌డిఎల్ వెబ్‌సైట్(https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html)లో ఫారమ్ నింపండి.
స్టెప్ 2: అప్లికేషన్ ఫారమ్ లో భారతీయ పౌరులు ఫారం 49ఎను , విదేశీ పౌరులు 49ఎఎను ఎంచుకోవాలి.
స్టెప్ 3 : ఈ దశలో మీరు కేటగిరి(individual, associations of persons, a body of individuals, etc.)ని ఎంచుకోవాలి.
స్టెప్ 4: ఇప్పుడు మీ పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ చిరునామా, మీ మొబైల్ నంబర్ వంటి అన్ని అవసరమైన వివరాలను సమర్పించండి.
స్టెప్ 5: వివరాలు పూర్తి చేసి submit క్లిక్ చేశాక మీకు ఒక మెసేజ్ కనిపిస్తుంది.
స్టెప్ 6: “పాన్ అప్లికేషన్ ఫారంతో కొనసాగండి” బటన్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 7: మీరు మీ డిజిటల్ ఇ-కెవైసిని సమర్పించాల్సిన క్రొత్త పేజీకి వెల్లుతారు.
స్టెప్ 8: ఇప్పుడు ఫారమ్ యొక్క తరువాతి భాగంలో మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి.
స్టెప్ 9: ఫారం యొక్క తరువాతి భాగంలో, మీ పరిచయం మరియు ఇతర వివరాలను నమోదు చేయండి.
స్టెప్ 10: ఫారమ్ యొక్క ఈ భాగంలో మీరూ మీ చిరునామా, మొబైల్ నెంబర్ వివరాలు సమర్పించాలి.
స్టెప్ 11: ఫారం యొక్క చివరి భాగంలో క్రింద చూపించిన డిక్లేరేషన్ వివరాలు సమర్పించి సబ్ మీట్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 12: తర్వాత దశలో మీరు సమర్పించాల్సిన పత్రాలు స్కాన్ చేసి అప్లోడు చేయాలి. అలాగే ఏవైనా ఉంటే దిద్దుబాట్లు చేసిన తర్వాత కొనసాగండి బటన్ క్లిక్ చేయండి.
స్టెప్ 13: ఇప్పుడు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ / డెబిట్ / క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
స్టెప్ 14: మీరు చెల్లింపు చేసిన తర్వాత, మీరు 16 అంకెల రసీదు స్లిప్‌తో రసీదు ఫారమ్‌ను పొందుతారు. ఇప్పుడు ప్రాసెస్ అంత పూర్తి అయ్యాక మీకు నెల రోజుల్లో మీ ఇంటికి పాన్ కార్డు పోస్టులో వస్తుంది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.