ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు మన జీవితంలో ముఖ్యం అయిపోయింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు దీనిని అప్ డేట్ చేస్తోంది. అంతేకాకుండా ఆధార్ కార్డులో మార్పులు, స్టేటస్ అప్ డేట్ చేయడం సులభతరం చేసింది. ఇప్పటి వరకు చాలా మార్పులు తీసుకొచ్చిన యుఐడిఏఐ ఇప్పుడు తాజాగా మరో సౌకర్యాన్ని ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధార్ కార్డుకు మన మొబైల్ నెంబర్ లింకు చేయాలకపోతే చాలా వరకు సేవలను కోల్పోయే అవకాశం ఉంది. (ఇది చదవండి: తెలంగాణ రేషన్ కార్డుదారులకు తపాలాశాఖ శుభవార్త!)
తాజాగా తెలంగాణలో కూడా రేషన్ కార్డు దారులు రేషన్ పొందాలంటే ఆధార్ కు లింకు చేయబడిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. అయితే చాలా మంది ప్రజలు ఆధార్ కి ఆధార్ లింకు చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా UIDAI ఆధార్ కార్డులో సరికొత్త అప్ డేట్ తీసుకువచ్చింది. దీంతో ఫోన్ నంబరును సులభంగా ఆధార్ కార్డుకు అనుసంధానం చేసుకోవచ్చు. దీనికోసం ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ యాడ్ చేయడం లేదా అప్ డేట్ చేయడం ఇప్పుడు సులభం.(ఇది చదవండి: ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్.. హ్యాకర్ల చేతిల్లోకి లక్షల మంది డేటా?)
మొబైల్ నెంబర్ లింకు ఎలా చేయాలి?
మీ మొబైల నెంబర్ ఆధార్ కు లింకు చేయడానికి దగ్గరలోని ఆధార్ సేవ కేంద్రాలకు వెళ్లాలి. మీ దగ్గరలోని ఆధార సేవ కేంద్రం తెలుసుకోవడంతో పాటు ఆన్ లైన్లో స్లాట్ బుక్ చేసుకోవడానికి ఆధార్ ఈ సదుపాయం కల్పించింది. ఆధార్ కు మొబైల్ కు లింకు చేయడానికి కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది, వేరే పత్రాలు అవసరం లేదు. మీరు ఆన్ లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి చేరుకున్నాక. అక్కడ కేవలం రూ. 50 రుసుము చెల్లిస్తే సరిపోతుంది. వెంటనే మీ ఆధార్ కార్డుకు మీ మొబైల్ నంబర్ లింక్ అవతుంది. అలాగే ఐరిస్ కోసం కూడా ఇలా చేయవచ్చు. స్లాట్ బుకింగ్ కోసం ఈ క్రింది వీడియొ చూడండి.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్(Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.