తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మూడు నెలల తర్వాత తిరిగి మొదలైంది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ ను తప్పనిసరి చేసింది తెలంగాణ ప్రభుత్వం. సోమవారం నుండి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కానుండగా స్లాట్ బుకింగ్ మాత్రం నిన్నటి నుండి మొదలయ్యాయి.
ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 24 స్లాట్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. తెలంగాణ రిజిస్ట్రేషన్ వెబ్ సైటు ద్వారా పౌరులకు, బిల్డర్‌లు స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. స్లాట్ బుకింగ్ తో పాటు సబ్ రిజిస్టర్ ఆఫీసు వివరాలు, ఇతర వివరాలు కూడా అందులో ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ రిజిస్ట్రేషన్ వెబ్ సైటు ద్వారా స్లాట్ బుకింగ్ ఈ క్రింది విదంగా చెప్పినట్లు చేయండి.
ఇంకా చదవండి: అన్నదాతలకు తీపికబురు.. అకౌంట్లలోకి రూ.2,000!
రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్ https://registration.telangana.gov.in/ ద్వారా స్లాట్‌లను ఆన్‌లైన్‌లో పొందవచ్చు. వెబ్‌సైట్‌లో బుక్ యువర్‌స్లాట్‌ను క్లిక్ చేసి పోర్టల్ లో మీ మొబైల్ నెంబర్ ని రిజిస్టర్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు పాస్వర్డ్, కాప్చా నమోదుచేయాలి. ఇప్పుడు లాగిన్ అయ్యాక స్లాట్ బుకింగ్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు సేల్, మార్ట్‌గేజ్, గిఫ్ట్ లావాదేవీలు ఎంచుకునే వీలు ఉంటుంది.
స్టిరాస్తి వివరాలు, కొనుగలు చేసే ఆస్తి ఉన్న ప్రాంతం, జిల్లా సబ్ రిజిస్ట్రర్ కార్యాలయాల వివరాలు నమోదు చేయాలి. తర్వాత పీటీఐఎన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఆ ఆస్తి యొక్క అన్నీ వివరాలు లభిస్తాయి. దాని తర్వాత ఆస్తికి సంబందించిన సరహద్దులు నమోదు చేయాలి. తర్వాతి దశలో మీకు ఆస్తి యొక్క మార్కెట్ రుసుము, రిజిస్ట్రేషన్ ఫీజు మీకు కనిపిస్తుంది. ఆస్తి వివరాలు ఆధారంగా మీకు రిజిస్ట్రేషన్ రుసుము నిర్దారణ అవుతుంది.
ఇంకా చదవండి: 1140 కోట్ల బంపర్ లాటరీ గెలుచుకున్న దంపతులు
నాల్గవ దశలో అమ్మకదారు వివరాలు నమోదు చేయాలి, తర్వాతి దశలో కొనుగోలుదారు వివరాలు నమోదు చేయాలి. ఆరోదశలో కొనుగోలుదారు కుటుంబ సభ్యుల వివరాలు పొందుపర్చాలి. అలాగే ఏడవ దశలో ఇద్దరు సాక్షుల పేర్లు, ఆధార్ నమోదు చేయాలి. ఈ ప్రక్రియ పూర్తి అయ్యాక ఎనిమిదవ దశలో అన్‌లైన్ లేదా చలానా ద్వారా నిర్దేశిత రిజిస్ట్రేషన్ రుసుమును చెల్లించాలి. చివరి దశలో మీకు ట్రాన్సాక్షన్ నెంబర్ సహాయంతో స్లాట్ ను బుక్ చేసుకోవాలి.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.