కరోనావైరస్ మహమ్మారి కారణంగా నవంబర్ నాటికి జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించలేని 35 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చే చర్యను ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్‌వో తీసుకుంది. పింఛన్ దారులు ఫిబ్రవరి 28 వరకు జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించడానికి గడువును పొడిగించింది. నవంబర్ 30 గడువు వరకు తమ జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించలేని పింఛనుదారులకు ప్రతి నెల ఫిబ్రవరి వరకు పెన్షన్ లభిస్తుంది.(చదవండి: మొబైల్ కాల్ కోసం ‘0’ని జత చేయాల్సిందే)
“కొనసాగుతున్న మహమ్మారి కరోనా వైరస్(COVID-19) కారణంగా వృద్దులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కావున, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) జీవిత ధృవీకరణ పత్రం సమర్పించడానికి 2021 ఫిబ్రవరి 28 వరకు కాలపరిమితిని పొడిగించింది” అని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ చర్యతో 35 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. ప్రస్తుతం జీవన ప్రమాణ పత్రాన్ని నవంబర్ 30లోపు ఎప్పుడైనా సమర్పించొచ్చు. దరఖాస్తు చేసిన తేదీ నుంచి ఏడాది వరకు ఇది వర్తిస్తుంది. తాజాగా ఆ గడువును ఫిబ్రవరి 28 వరకు పొడగించారు. సాధారణ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులు, ఫించన్లు ఇచ్చే బ్యాంకు శాఖల్లో జీవన ప్రమాణ పత్రాలను సమర్పించొచ్చు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.