PM Kisan Samman Nidhi Yojana: కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపికబురు అందించేందుకు సిద్దం అవుతుంది. ప్రధాన మంత్రి కిసాన్(పీఎం కిసాన్) సమ్మాన్ నిధి యోజన పథకం కింద రైతుల ఖాతాలో ఏప్రిల్ 1 నుంచి రూ.2,000 జమ చేయాలని చూస్తుంది. మోదీ ప్రభుత్వం ఇప్పటికే 7 విడతలలో డబ్బులను రైతులకు అందించింది. ఇప్పుడు 8వ విడత డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది.

కొన్ని నివేదికల ప్రకారం మోదీ సర్కార్ ఏప్రిల్ 1 నుంచి దశల వారీగా పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ.2 వేలను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. ఉగాది ముందు వరకు రైతులకు ఈ రూ.2,000 లభించనున్నాయి. దీంతో రైతులకు ప్రయోజనం కలుగనుంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ స్కీమ్‌ను 2019 ఫిబ్రవరి 1 న తీసుకువచ్చింది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ఏడాదికి రూ.6 వేలు లభిస్తాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా ఏడాదిలో 3 విడతల వారీగా రైతుల ఖాతాలో జమ చేస్తారు. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవచ్చు.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.