తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతిల్లోని ఇండ్ల రిజిస్ట్రేషన్ చార్జీల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వేరు వేరుగా ఉన్న చార్జీలు స్థానంలో ఇప్పుడు కొత్తగా ధరలను నిర్ణయించింది. గ్రామ పంచాయతిల్లోని ఇండ్ల రిజిస్ట్రేషన్ యొక్క కనీస ఛార్జీని రూ.800గా నిర్ణయిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలో 0.1 శాతం లేదా రూ.800 చెల్లించాలని, ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే అదే చార్జీ వసూలు చేయాలని అందులో పేర్కొంది.
ఇంతక ముందు వరకు పంచాయతీల తీర్మానం మేరకే మ్యుటేషన్ చార్జీలు వసూలు చేసేవారు. ఇప్పటి వరకు పంచాయతికి ఓ రకంగా ఛార్జీలు ఉండకుండా ప్రభుత్వం అన్నీపంచాయతీల్లో ఒకే విధంగా ఉండాలని భావించి ఈ చార్జీలను నిర్ణయించినట్లు తెలిపింది. రిజిస్ట్రేషన్ ఫీజును సబ్ రిజిస్ట్రార్1` ఆఫీసుల్లోనే వసూలు చేసి, తర్వాత పంచాయతీలకు ట్రాన్స్ఫర్ చేస్తారు.
ఇంతకుముందు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ అయిన ఆస్తులను పంచాయతీ రికార్డుల్లో మార్చుకునేందుకు ప్రత్యేకంగా పంచాయతీల్లో దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. మ్యుటేషన్ పూర్తయ్యేందుకు ఒక్కోసారి నెలల తరబడి టైం పట్టేది. కానీ ఇకపై రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ లో పంచాయతీల ప్రమేయం ఉండదు. నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కాగానే అక్కడికక్కడే మ్యుటేషన్ చేయనున్నారు. ఇందు కోసం ధరణితో ఇ–పంచాయతీ పోర్టల్‌ను కనెక్ట్ చేయనున్నారు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.