Tuesday, November 26, 2024
HomeGovernmentSchemesAyushman Vay Vandana Card: 70 ఏళ్లు దాటిన వృద్దులకు ఉచితంగా రూ. 5 లక్షల...

Ayushman Vay Vandana Card: 70 ఏళ్లు దాటిన వృద్దులకు ఉచితంగా రూ. 5 లక్షల ఆరోగ్య బీమా!

Ayushman Vay Vandana Card: ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన(AB PM-JAY) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ స్కీమ్లో భాగంగా 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వృద్ధులందరికీ ఆరోగ్య బీమా కవరేజీని అందించన్నున్నారు.

సామాజిక ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 70 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులందరికీ ఆరోగ్య సంరక్షణను అందించడానికి PM నరేంద్ర మోదీ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY)ని ప్రారంభించారు. ఉచిత చికిత్స కోసం సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు కవరేజీని అందిస్తుంది.

ఆయుష్మాన్ వయ వందన కార్డ్ అంటే ఏమిటి?

70 ఏళ్లు పైబడిన ప్రతి సీనియర్ సిటిజన్‌కు ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స అందిస్తారు. ఈ సీనియర్ సిటిజన్లందరికీ ఆయుష్మాన్ వయ వందన కార్డ్ జారీ చేస్తారు. ఈ పథకం ఒక మైలురాయిగా ఉంటుందని భావిస్తున్నారు. ఇంట్లో వృద్ధులకు ఆయుష్మాన్ వయ వందన కార్డ్ ఉంటే కుటుంబ ఖర్చులు తగ్గుతాయి.

ఇతర ఆరోగ్య బీమా!

సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (CGHS), ఎక్స్-సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ECHS), ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (CAPF) వంటి ఇతర పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ల ప్రయోజనాలను ఇప్పటికే పొందుతున్న 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్‌లు ప్రస్తుత పథకం లేక ఆయుష్మాన్ భారత్ పథకంలో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవచ్చు. కుటుంబ ప్రాతిపదికన రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా కవరేజీతో 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లతో సుమారు 4.5 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చడం ఈ పథకం లక్ష్యం.

- Advertisement -

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

PMJAY వెబ్‌సైట్‌ని సందర్శించాలి. AM I eligible ట్యాబ్‌పై క్లిక్ చేయండి. OTPని నమోదు చేయడం ద్వారా మొబైల్ నంబర్‌ను ధృవీకరించాలి. రాష్ట్రం & పథకాన్ని ఎంచుకోవాలి. అర్హత ఉంటే స్వతహాగా రిజిస్టర్ చేసుకోవాలి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles