AP Deepam Scheme Apply Online: ఆంధ్రప్రదేశ్‌లో దీపం-2 పథకం కింద ప్రభుత్వం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ దీపం పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవంబరు 1న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో ప్రారంభించారు. సూపర్ సిక్స్‌లో అమలవుతున్న మొదటి పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకమని గుర్తు చేశారు. తొలిరోజు 4.3 లక్షల బుకింగ్‌లు అయ్యాయని.. లబ్ధిదారుల నుంచి భారీ స్పందన వస్తోందన్నారు.
ఒకవేళ ఉచిత సిలిండర్ల పథకానికి సంబంధించి ఏదైనా సందేహాలుంటే టోల్‌ఫ్రీ నంబరు 1967కి కాల్ చేయాలని పేర్కొన్నారు. అలాగే ఈ దీపం పథకానికి అవసరమైన నిధుల్ని విడుదల చేశారు. ఈ పథకం కింద నాలుగు నెలలకో ఒక సిలిండర్ చొప్పున ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తోంది ప్రభుత్వం. ఈ పథకానికి రాయితీ రూపంలో ఏడాదికి రూ.2,684 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
AP ఉచిత గ్యాస్ సిలిండర్ దీపం-2 పథకం అర్హతలు:
- దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసితులై ఉండాలి.
- దరఖాస్తుదారుడు కచ్చితంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలి.
- ఒక ఇంటికి ఏడాదిలో 3 గ్యాస్ సిలిండర్లు మాత్రమే ఉచితంగా ఇవ్వబడును.
దీపం ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- మొదట మీరు గ్యాస్ ఈ-కెవైసీ పూర్తి చేసి ఉండాలి.
- ఆ తర్వాత మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే ముందు మీ రేషన్ కార్డు గ్యాస్ ఏజెన్సీకి సమర్పించాలి.
- మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న 48 గంటల్లో సిలిండర్ డెలివరీ చేస్తారు.
- మీరు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన 48 గంటల్లో డబ్బులు రీఫండ్ చేస్తారు.
AP ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అవసరమైన పత్రాలు:
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
- చిరునామా రుజువు
- ఆదాయ ధృవీకరణ పత్రం
- బ్యాంక్ పాస్ బుక్ కాపీ
- కరెంట్ గ్యాస్ కనెక్షన్ బిల్లు
- గ్యాస్ కనెక్షన్ పుస్తకం
- దీపం పథకం Helpline నంబర్ – 1967
- దీపం పథకం టోల్ ఫ్రీ నంబర్ – 14400