Saturday, March 7, 2026
HomeGovernmentSchemesPMKMY: రైతులకు అండగా మరో పథకం.. ప్రతి నెల రూ.3 వేల పింఛన్‌!

PMKMY: రైతులకు అండగా మరో పథకం.. ప్రతి నెల రూ.3 వేల పింఛన్‌!

Pradhan Mantri Kisan Maandhan Yojana Scheme: How to Apply, eligibility Full Details in Telugu: రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే, ఇందులో ఒకటి వృద్ధాప్యంలోకి వచ్చిన రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన పేరుతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న 60 ఏళ్లు దాటిన సన్న, చిన్నకారు రైతులకు ప్రతి నెలా రూ.3 వేల చొప్పున జీవిత కాలం పింఛన్‌ అందిస్తుంది.

ఈ రోజు ఈ కథనంలో అస్సలు ఎవ్వరూ అర్హులు, ఎవరు అనర్హులు, దరఖాస్తు ఎలా చేసుకోవాలి అనే వాటి గురించి తెలుసుకుందాం.

ప్రధానమంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన పథకానికి ఎవరు అర్హులు?

18 నుంచి 40 ఏళ్ల వయసు ఉన్న సన్న, చిన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు. ఐదు ఎకరాలలోపు సొంత వ్యవసాయ భూమి ఉండి, ఆయా ప్రభుత్వాల భూ రికార్డుల్లో పేరు నమోదైన రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న రైతులు వయసు వారీగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రీమియం చెల్లిస్తూ పీఎం కిసాన్‌ మాన్‌ధన్‌ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎవరు అనర్హులు..?

నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌(ఎన్‌పీఎస్‌), ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చిన వారు ఈ పథకానికి అనర్హులు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, ఆర్థికంగా బాగున్న, సామాజిక భద్రత పథకాల పరిధిలో ఉన్న వారికి ఈ పథకం వర్తించదు.

- Advertisement -

ప్రీమియం ఎంత కట్టాలి..?

18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు ప్రతి నెలా రూ.55 నుంచి రూ.200 వరకు ప్రీమియం చెల్లించాలి. వయసును బట్టి ఈ ప్రీమియం పెరుగుతూ వస్తుంది. 18 ఏళ్ల వయసున్న రైతు నెలకు రూ.55 చొప్పున చెల్లిస్తే కేంద్రం తన వాటాగా మరో రూ.55 కలిపి మొత్తం రూ.110 బీమా చెల్లిస్తుంది. అలాగే, రైతులు చెల్లించిన మొత్తానికి సమాన మొత్తాన్ని కేంద్రం చెల్లిస్తుంది.

ఇలా 60 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లిస్తే.. ఆ తర్వాత నెలకు రైతులకు రూ.3 వేల చొప్పున పింఛన్‌ వస్తుంది. బీమా చెల్లించిన రైతు మరణిస్తే ఆయన భార్యకు ప్రతినెలా రూ.1500 చొప్పున పింఛను అందజేస్తుంది.

పీఎం కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

పీఎం కిసాన్‌ మాన్‌ధన్‌ కింద పింఛను ప్రయోజనం పొందేందుకు ఆసక్తి ఉన్న రైతులు సీఎస్‌సీ కేంద్రానికెళ్లి పీఎం కిసాన్‌ కేఎంవై పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తును ఫారం డౌన్‌లోడ్‌ చేసుకుని ఆధార్, నామినీ వివరాలు, రైతు సంతకంతో వంటి వివరాలు అప్‌లోడ్‌ చేసిన అనంతరం మీ పింఛన్‌ కార్డు వస్తుంది. ఆ తర్వాత పీఎం కిసాన్‌ పథకానికి అనుసంధానమైన బ్యాంకు ఖాతా నుంచి ప్రతి నెల ప్రీమియం నగదు చెల్లించాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles