Indiramma Indlu Application Status Online: అర్హులైన నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఏడాది క్రితం ప్రజాపాలన కింద దరఖాస్తులు స్వీకరించగా సర్వే నిర్వహించి లబ్ధిదారులను గుర్తించారు. అలాగే, గత నెలలో ఇంకా దరఖాస్తు వారి నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించింది.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తమ దరఖాస్తు పరిస్థితి ఏమిటో సమాచారం తెలియక చాలా మంది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి వారి కోసం అధికారులు ఆన్‌లైన్‌లో జాబితాను రూపొందించారు. మీ ఇళ్ల పథకం దరఖాస్తు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందిరమ్మ ఇళ్ల పథకం దరఖాస్తు స్టేటస్ చెక్ చేసుకోండి ఇలా..?
- మీరు గూగుల్‌లో https://indirammaindlu.telangana.gov.in వెబ్‌సైట్‌ను నమోదు చేయగానే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.
- ఆ తర్వాత అప్లికేషన్ సెర్చ్‌ను ఎంపిక చేసుకోవాలి.
- ఇప్పుడు మొబైల్ నెంబర్, ఆధార్‌కార్డు, అప్లికేషన్ ఐడీ, రేషన్‌కార్డు అంశాల్లో ఏదో ఒక వివరాలు నమోదు చేయగానే మన అప్లికేషన్ వివరాలు ప్రత్యక్షమవుతాయి.
- ఆ తర్వాత సర్వే స్థితి, మీ దరఖాస్తు ఎక్కడి వరకు వచ్చింది అనేది మీరు తెలుసుకోవచ్చు.