Mahalakshmi Scheme Full Details in Telugu: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను పథకాల్ని ప్రకటించింది. ఊహించని విధంగా ఆ పథకాలకు ఆకర్షితులైన ఓటర్లు గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసుకు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
అయితే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు మూడు హామీలను అమలు చేయనున్నట్లు తెలిపారు. అందులో ఒకటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్, మూడోది మహిళలకు ప్రతినెలా రూ. 2500 రూపాయల నగదు.
(ఇది కూడా చదవండి: Aadhaar Card: ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలా?)
ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీలను అమల్లోకి తెచ్చింది. కానీ మహాలక్ష్మి పథకం నెలకు రూ.2500 ఇవ్వాల్సి ఉండగా.. ఆ పథకాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఈ స్కీమ్ గురించి కొన్ని ముఖ్య విషయాల గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం..
అర్హతలు: దారిద్ర్య రేఖకు దిగువున అంటే ఓ కుటుంబానికి ఏడాదికి వచ్చే ఆదాయం రూ.3 లక్షలు మించకూడదు. అలాగే తెలంగాణ మహిళలై ఉండాలి.
మహాలక్ష్మి పథకానికి కావాల్సిన డాక్యుమెంట్లు
- భార్య ఆధార్ కార్డ్, భర్త ఆధార్ కార్డ్
- 18 నుంచి 55సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి. అందుకు అర్హులైన వారు మహాలక్ష్మి పథకానికి అప్లయి చేసుకోవచ్చు.
- ఇక్కడ భార్య, భర్త ఆధార్ కార్డ్ ఆధారంగా వారికి వచ్చే ఆదాయం ఎంత అనేది ప్రభుత్వం కౌంట్ చేస్తుంది.
- రూ.3 లక్షలు దాటితే అనర్హులుగా ప్రకటిస్తుంది.
- తెల్లరేషన్ కార్డ్
- ఓటర్ ఐడీ కార్డ్ (ఆప్షనల్ – ఇవ్వాలనుకంటే ఇవ్వొచ్చు)
- కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు(ఆప్షనల్- ఎందుకంటే రూ.500 గ్యాస్ కు అప్లయ్ చేసుకుంటారు కాబట్టి అవసరం లేదు.)
- బ్యాంక్ పాస్ బుక్, బ్యాంక్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోస్
- ఇన్ కమ్ సర్టిఫికెట్
- క్యాస్ట్ సర్టిఫికెట్
- కాంటాక్ట్ నెంబర్స్ సబ్మిట్స్ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మీ అర్హతను బట్టి మీకు రూ.2500 ఇవ్వాలా? వద్దా? ప్రభుత్వం నిర్ణయించే ప్రాసెస్ ప్రారంభం అవుతుంది.
అర్హులు ఎవరు?
స్కీమ్ ను ప్రకటించే సమయంలో మహాలక్ష్మి పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2,500 పొందేందుకు కావాల్సిన అర్హతల్ని ప్రకటించింది. అవి ఎలా ఉన్నాయంటే?
- తెలంగాణ పౌరులని ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించాలంటే.. కనీసం మీరు తెలంగాణలో ఆరు నెలల పాటు నివసించి ఉండాలి. అడ్రస్ ప్రూఫ్ కింద ఓటర్ ఐడీ, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ లను తప్పని సరి చేసింది.
- వయస్సు అర్హత: 18 నుంచి 55 ఏళ్ల వయస్సు ఉండాలి.
ఆదాయం ఎంత ఉండాలి?
ప్రభుత్వం లెక్కల ప్రకారం.. తెలంగాణలో ఒక్కో మనిషి ఆదాయం ఏడాదికి మూడున్నర లక్షలు. అయితే మహాలక్ష్మి పథకంలో అర్హుత సాధించాలంటే కుటుంబం కావొచ్చు. కుటంబంలోని మహిళ ఆదాయం కావొచ్చు రూ.3 లక్షలు మించకూడదు. ఆ లెక్కన కోటి 50 లక్షల మంది అర్హులని ప్రభుత్వ అంచనా.
కమ్యూనిటీ: ఎస్సీ, ఎస్టీ, బీసీ