Thalliki Vandanam Scheme Eligibility Details in Telugu: తల్లికి వందనం అనే పథకాన్ని 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ఎలాంటి ఆర్ధిక పరమైన ఇబ్బందులు పడకూడదనే సదుద్దేశ్యంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చారు.
తల్లికి వందనం పథకం పూర్తి వివరాలు:
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు అందించనున్న సంక్షేమ పథకాల్లో తల్లికి వందనం పథకం ఒకటి. ఈ పథకంలో అమలులో భాగంగా ప్రభుత్వ నిర్ధేశించిన అర్హతలున్న ఒకటి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్ధుల తల్లులు, సంరక్షకులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఒవైపు నిరక్షరాస్యత తగ్గిస్తూనే ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేలా ఏడాదికి రూ.15,000 అందించనుంది.
తల్లికి వందనం పథకం 2024 ప్రయోజనాలు:
ఉద్దేశ్యం: పిల్లల చదువుకు సహాయం చేయడానికి, ప్రతి అర్హత కలిగిన తల్లి లేదా సంరక్షకుడికి రూ. సంవత్సరానికి 15,000 అందిచనుంది. విద్యార్ధులు వారికి అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోట్స్ లు , బూట్లు, బెల్టులు, టైలు, సాక్స్‌లు, ఇతర అవసరాల వంటి ప్రాథమిక విద్యకు అవసరమయ్యే సామగ్రిని అందిస్తుంది.
తల్లికి వందనం పథకం 2024 దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్లు:
- ఫోటోతో కూడిన బ్యాంక్ లేదా పోస్టాఫీస్ పాస్‌బుక్
- పాన్ కార్డ్
- రేషన్ కార్డు
- ఓటరు గుర్తింపు కార్డు
- పనికి ఆహార పథకం కార్డ్
- కిసాన్ ఫోటో పాస్‌బుక్
తల్లికి వందనం పథకానికి కావాల్సిన అర్హతలు:
- అభ్యర్థి శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసించాలి.
- దరఖాస్తుకు ఆధార్ కార్డు అవసరం.
- ఆర్థికంగా బలహీనంగా ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- దరఖాస్తుదారుడి హాజరులో కనీసం 75శాతం ఉండాలి.
తల్లికి వందనం పథకంలో విద్యార్ధుల్ని ఎలా ఎంపిక చేస్తారు?
- అభ్యర్థులు అర్హత ఆధారంగా ఎంపిక చేయబడతారు.
- ఈ పథకం ఆర్థికంగా బలహీనమైన నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులను మాత్రమే ఎంపిక చేస్తుంది.
- ఈ పథకం కోసం వారి దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలంటే, అభ్యర్థులు తప్పనిసరిగా 1 నుండి 12 తరగతులలో నమోదు చేయబడాలి.
- దరఖాస్తుదారు హాజరు 75శాతం కంటే తక్కువగా ఉంటే ఈ పథకానికి అనర్హులు.