మీరు ఇంకా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోకపోతే మీకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఒక ఇంటర్వ్యూలో తెలంగాణ పౌర సరపరాల శాఖ మంత్రి మాట్లాడుతూ.. ఇంకా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోని వారు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు అని పేర్కొన్నారు.
అందులో భాగంగానే రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకునే వారి కోసం దరఖాస్తు ఫామ్‌ను విడుదల చేశారు. ఈ ఫాం మీసేవా పోర్టల్‌లో అందుబాటులో ఉంది. అధికారిక వెబ్‌సైట్ https://meeseva.telangana.gov.in/ నుంచి రేషన్‌కార్డు ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రేషన్ కార్డు కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?
కుటుంబ సభ్యుడి పేరును రేషన్ కార్డులో కలపాలనుకున్నా, పేరును తొలగించాలనుకున్నా దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డు దరఖాస్తును నింపిన తర్వాత మీ మండల కార్యాలయంలో లేదా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఫారంను సమర్పించవచ్చు.
రేషన్ కార్డు దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాలు ఏమిటి?
రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డ్, నివాస ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, వార్షిక ఆదాయ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, జన్మదిన ధ్రువీకరణ పత్రం, మొబైల్ నంబర్, మీ చిరునామా వంటివి పొందుపర్చాలి. రేషన్ కార్డును దరఖాస్తు చేసుకున్న తర్వాత దాని స్టేటస్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి అడిగిన వివరాలు పొందుపర్చాలి.
రేషన్ కార్డు దరఖాస్తు ఫారం కోసం ఈ లింకు ఓపెన్ చేయండి: https://drive.google.com/file/d/1smP3BR-2tH7f32a-R54bJj9qZPmQGV6q/view?usp=sharing