Friday, November 22, 2024
HomeGovernmentDharani Portal Benefits: ధరణి వెబ్ సైట్ వల్ల కలిగే లాభాలు ఏమిటి?

Dharani Portal Benefits: ధరణి వెబ్ సైట్ వల్ల కలిగే లాభాలు ఏమిటి?

Dharani Portal Benefits: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌ను సీఎం కేసీఆర్‌ అక్టోబర్ 29న ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజల అనంతరం ధరణి పోర్టర్‌ అధికారికంగా ప్రారంభించారు. రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను తీసుకొస్తుంది.

దీంతో ఇకపై అన్ని రకాల రిజిస్ట్రేషన్లు అన్‌లైన్‌లోనే జరగనున్నాయి. దీని ద్వారా వ్యవసాయ, వ్యవసాయేతర సేవలను తీసుకురావాలని మొదట భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల వ్యవసాయనికి సంబందించిన సేవలను మాత్రమే తీసుకొచ్చారు. అసలు ఈ ధరణి పోర్టల్ ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ధరణి పోర్టల్ వల్ల కలిగే లాభలేమిటి?

ధరణి పోర్టల్ ని ఓపెన్ చేయగానే మీకు అక్కడ మీకు Agriculture ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు పోర్టల్ యొక్క మెయిన్ పేజీ లోకి అక్కడ మీకు Home, Slot booking for Citizen Land Details, Search Prohibited Lands, Encumbrance Details, View market value of lands for Stamp Duty అనే ఆప్షన్ లు మీకు కనిపిస్తాయి.

Home అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు తిరిగి మొదటి పేజీకి వెళ్తారు. అదే Slot booking for Citizen Land Details అనే దానిలో మొత్తం భూమికి సంబందించిన లావాదేవీలు ఈ ఆప్షన్ ద్వారా జరుగుతాయి. Slot booking for Citizen Land Details క్లిక్ చేస్తే మీకు మొబైల్ నెంబర్, పాస్ వర్డ్ అడుగుతుంది.

దీని కోసం New User Please Sign Up Here ద్వారా యూజర్ మీ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. మీ అకౌంట్ ద్వారా login అయ్యాక మీకు అక్కడ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన ఆప్షన్ మీకు కనిపిస్తాయి వీటి గురుంచి పూర్తిగా వేరే ఆర్టికల్ లో తెలుసుకుందాం.

- Advertisement -

ధరణి పోర్టల్ లో Search Prohibited Lands అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీ గ్రామంలో ఉన్నా ప్రభుత్వం చేత నిషేదింపబడిన సర్వే నెంబర్లు మీకు కనిపిస్తాయి. అసైన్డ్ భూములు, కాలువల క్రింద ఉన్నా భూములు, చెరువుల కింద ఉన్నా భూములు, ఇతర ప్రభుత్వ సంబందిత భూములు మీకు కనిపిస్తాయి.

ఇందులో ఉన్నా భూములను ఏంటి పరిస్థితిలో కొనుగోలు చేయకూడదు. ధరణి పోర్టల్ లో ఉన్నా Encumbrance Details అనే ఆప్షన్ క్లిక్ చేసి వివరాలు సమర్పించిన తర్వాత మీకు ఏ సర్వే యొక్క వివరాలు ఎంచుకోవాలి. భూమి లావాదేవీలు జరిపే ముందు అన్నిటికంటే ముఖ్యమనది ఇది.

ఎందుకంటే, దీని ద్వారా మనకు ఆ స్టిరాస్తి యొక్క పూర్వ(చరిత్ర) పరాలు తెలుస్తాయి. ఒక భూమి ఎంత మంది చేతులు మారింది మరియు ఏమైనా లోన్లు, లీజ్ లకు సంబందించిన అన్నీ వివరాలు ఇక్కడ తెలుస్తాయి. ఇది అన్నటికంటే ముఖ్యనమైనది.

ధరణి పోర్టల్ లో ఉన్నా View market value of lands for Stamp Duty అనే ఆప్షన్ ద్వారా మీకు మీ భూమి సంబందించిన లేదా కొనుగోలు చేసే భూమి యొక్క ప్రభుత్వం చేత నిర్దేశింపబడిన మార్కెట్ వాల్యూ అనేది మీకు కనిపిస్తుంది. దీని వల్ల మనకు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు Stamp Duty ఛార్జీలు తెలుస్తాయి.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles