Aadhaar Update: మన దేశంలో ఆధార్ కార్డు ఎంత విలువైన గుర్తింపు పత్రం అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకే, కేంద్ర ప్రభుత్వం చిన్న పిల్లవాడి నుంచి 60 ఏళ్ల వృద్ధుడి వరకు ప్రతీ ఒక్కరికి ఈ కార్డు జారీ చేస్తుంది. పాస్ పోర్టు కోసం ధరఖాస్తు చేసుకోవాలన్న, కొత్త బ్యాంకు అకౌంట్ తీసుకోవాలన్న ఇలాంటి మరెన్నో సేవల కోసం ఆధార్ కార్డు తప్పనిసరి. ఇలాంటి ముఖ్యమైన ఆధార్ కార్డులో పేరు, ఫోటో, చిరునామా వంటి మొదలైన వివరాలను అప్ డేట్ చేయడం కోసం యూఐడీఏఐ ఈ సేవలను ఆన్ లైన్ చేసింది.

అయితే, ఆధార్ కార్డు మీద ఉన్న ఫోటో గురుంచి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ కార్డులో ఉన్నది మనమే అని చెప్పిన ఎవరు కూడా నమ్మరు. గతంలో ఆధార్ కార్డులో ఉన్న ఫోటో మార్చడానికి అవకాశం ఉండేది కాదు. కానీ, గత కొద్ది నెలల నుంచి ఫోటో మార్చుకునే అవకాశాన్ని యూఐడీఏఐ అందిస్తుంది. మీ ఆధార్ కార్డుపై ఉన్న ఫోటోను ఎలా మార్చుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఆధార్ కార్డులో ఫోటోను మార్చుకోండి ఇలా..

  • యూఐడీఏఐ అధికారిక వెబ్ సైట్ నుంచి ఆధార్ నమోదు ఫారాన్ని(Aadhaar Enrolment Form) డౌన్ లోడ్ చేసుకోండి.
  • ఫారంలో మీ పూర్తి వివరాలను నింపండి.
  • మీ సమీపంలోని ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ సందర్శించండి.
  • ఆధార్ ఎన్ రోల్ మెంట్ ఎగ్జిక్యూటివ్ కు మీ ఫారాన్ని సబ్మిట్ చేయండి.
  • ఎగ్జిక్యూటివ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా మీ వివరాలు వెరిఫై చేస్తారు.
  • ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్/ఆధార్ సేవా కేంద్రంలో మీ కొత్త ఫోటోను అక్కడ ఉన్న అధికారి తీసుకుంటారు.
  • ఫోటో అప్ డేట్ సర్వీస్ కోసం రూ.25 + జీఎస్ టీ ఫీజు చెల్లించాలి.
  • మీకు అప్ డేట్ రిక్వెస్ట్ నెంబరు(ఆర్ఎన్ఆర్ఎన్)తో కూడిన ఒక ఎక్ నాలెడ్జ్ మెంట్ స్లిప్ ఇస్తారు.
  • ఆన్ లైన్ లో ఫోటో అప్ డేషన్ ప్రక్రియ స్టేటస్ ఆర్ఎన్ఆర్ఎన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

మీ కొత్త ఫోటో అప్ డేట్ అయిన తర్వాత మీరు మీ ఆధార్ కార్డు ఈ-కాపీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే, కార్డుదారులు యూఐడీఏఐ పోర్టల్ నుంచి ఫిజికల్ పీవీసీ కార్డు కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here