Sunday, November 24, 2024
HomeBusinessGold: పాన్‌/ఆధార్‌ లేకుండా ఎంత డబ్బుతో బంగారం కొనొచ్చు?

Gold: పాన్‌/ఆధార్‌ లేకుండా ఎంత డబ్బుతో బంగారం కొనొచ్చు?

How Much Gold Can You Buy Legally Without Pan Card: కొద్ది రోజుల క్రితం ఆర్‌బీఐ రూ.2,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ప్రజలు తమ దగ్గర ఉన్న రూ.2,000 నోట్లను ఖర్చు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. తమ దగ్గర ఉన్న రూ.2,000 నోట్లతో ఎక్కువ మంది బంగారం(Gold) కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

అయితే, నగదుతో బంగారం కొనడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి అనే విషయం మీకు తెలుసా. తెలవకపోతే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!

కేంద్ర ప్రభుత్వం రత్నాభరణాల రంగాన్ని 2002లో అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం(PMLA) పరిధిలోకి తీసుకొని వచ్చింది. ఇందుకు సంబంధించి డిసెంబరు 2020లో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో ఒక పరిమితికి మించిన తర్వాత నగదుతో కొనుగోలు చేసే వారి నుంచి ఆభరణాల సంస్థలు పాన్‌, ఆధార్‌ వంటి కేవైసీ డాక్యుమెంట్లు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, రూ.10 లక్షల కంటే ఎక్కువ మొత్తంతో కొనుగోళ్లు చేసేవారి వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలి.

పాన్ లేకుండా ఎంత నగదుతో బంగారం కొనొచ్చు?

ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం.. ఒక పరిమితికి మించి నగదుతో లావాదేవీలు జరపడానికి వీలులేదు. సెక్షన్‌ 269ఎస్‌టీ ప్రకారం.. ఆభరణాల కొనుగోలులో ఒక వ్యక్తి ఒకరోజులో రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తం నగదుతో లావాదేవీ జరపడానికి అనుమతి లేదు. ఈ నేపథ్యంలో ఒకవేళ రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తం నగదుతో ఆభరణాలు కొనుగోలు చేస్తే ఆదాయ పన్ను నిబంధనల్ని అతిక్రమించినట్లు అవుతుంది.

- Advertisement -

అయితే, ఇలాంటి సమయంలో ఎవరైతే నగదును స్వీకరించారో వాళ్లు లావాదేవీ మొత్తాన్ని జరిమానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.

ఉదాహరణకు ఒక వ్యక్తి ఓ నగల దుకాణంలో రూ.4 లక్షల విలువ చేసే బంగారం లేదా ఇతర ఆభరణాలు కొనుగోలు చేసినప్పుడు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 269ఎస్‌టీ ఉల్లంఘించినట్లు అవుతుంది. ఇలాంటి సమయంలో నగదు తీసుకున్న నగల వ్యాపారి.. లావాదేవీ మొత్తాన్ని జరిమానా కింద చెల్లించాల్సి ఉంటుంది.

అంటే ఇక్కడ రూ.4 లక్షలు జరిమానాగా చెల్లించాలి. నగల వ్యాపారే జరిమానా చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో సాధారణంగా వారు రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తం నగదును స్వీకరించడానికి సాహసం చేయరు.

రూ.2 లక్షలు దాటితే జరిమానా చెల్లించాలా..?

ఒకవేళ రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తంతో ఆభరణాలు కొనుగోలు చేయాలంటే కచ్చితంగా పాన్‌ లేదా ఆధార్‌ సమర్పించాల్సి ఉంటుంది. ఆదాయ పన్ను చట్టంలోని నిబంధన 114బీ ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.

నగదుతో చెల్లిస్తున్నారా లేక ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ చేస్తున్నారా అనే దానితో సంబంధం లేదు. బంగారం కొనుగోలు విలువ రూ.2 లక్షలు దాటితే పాన్‌ లేదా ఆధార్‌ సమర్పించాల్సిందే అనే విషయం మీరు గుర్తుంచుకోవాలి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles