Caste Certificate Online in Andhra Pradesh: ప్రభుత్వం అందించే పథకాల నుంచి కాలేజీ,స్కూల్స్ లో అడ్మిషన్ తీసుకునే వరకు ఇలా ప్రతి అంశంలోనూ క్యాస్ట్ సర్టిఫికెట్ తప్పని సరి. కుల ధృవీకరణ పత్రాన్ని బడుగు బలహీన వర్గాల ప్రజలకు శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తాయి. క్యాస్ట్ సర్టిఫికెట్లను రాష్ట్ర రెవెన్యూ శాఖ జారీ చేస్తుంది. అయితే ఇప్పుడు మనం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కుల ధృవీకరణ పత్రాన్ని ఎలా పొందాలో తెలుసుకుందాం..
కుల ధృవీకరణ పత్రం వల్ల కలిగే ప్రయోజనాలు:
కుల ధృవీకరణ పత్రం ప్రధానంగా షెడ్యూల్డ్ కులాలు, తెగలు లేదా వెనుకబడిన తరగతుల వంటి వర్గానికి చెందిన ప్రజలకు రిజర్వేషన్ పొందడానికి సహాయపడుతుంది
- చట్టసభలు, ప్రభుత్వ సర్వీసులో సీట్ల రిజర్వేషన్ పొందేందుకు
- పాఠశాలలు మరియు కళాశాలల్లో అడ్మిషన్ కోసం ఫీజులో కొంత భాగాన్ని లేదా మొత్తం మాఫీ చేయడం కోసం
- విద్యా సంస్థల్లో కోటాలు పొందేందుకు స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి.
- ప్రభుత్వ రాయితీలు పొందాలంటే కుల ధృవీకరణ పత్రం అవసరం.
- నిర్దిష్ట ఉద్యోగాలకు దరఖాస్తు చేసేటప్పుడు గరిష్ట వయోపరిమితి సడలింపు పరిమితులను పొందడానికి.
- ప్రభుత్వ, ప్రభుత్వేతర పథకాల కింద విద్య, ఇల్లు లేదా వ్యాపారం కోసం రుణం పొందడానికి.
- కుల ధృవీకరణ పత్రం షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతుల వారికి మెరుగైన అవకాశాలను అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగపరిచేందుకు ప్రభుత్వాలు అందిస్తాయి.
క్యాస్ట్ సర్టిఫికెట్ పొందేందుకు కావాల్సిన అర్హతలు:
- దరఖాస్తుదారుడు కుల ధృవీకరణ పత్రాన్ని పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశించిన దిగువ అర్హతులు ఉండాలి.
- దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా ఉండాలి.
- ఏదైనా పౌరుడు అతను/ఆమె షెడ్యూల్డ్ కులం (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), ఇతర వెనుకబడిన వర్గాలు (OBC) వంటి వెనుకబడిన కమ్యూనిటీకి చెందినవారైతే కుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
కుల ధృవీకరణ పత్రం కోసం అవసరమైన పత్రాలు
అన్ని పత్రాలు తప్పనిసరిగా ప్రభుత్వ శాఖలో పని చేసే గెజిటెడ్ అధికారి ద్వారా ధృవీకరించబడి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ కుల ధృవీకరణ పత్రం పొందేందుకు ఈ క్రింది పత్రాలు అందించవలసి ఉంటుంది.
- ఒక దరఖాస్తు ఫారం
- రేషన్ కార్డ్ కాపీ / ఓటర్ కార్డ్ కాపీ / ఓటరు జాబితాలో పేరు (వాటిలో ఒకటి)
- ఆదాయ ధృవీకరణ పత్రం
- ఆధార్ కార్డ్
- ఇంటి అడ్రస్ ఫ్రూఫ్
- స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్/బదిలీ సర్టిఫికేట్
- వివాహానికి ముందు మహిళల కుల ధృవీకరణ పత్రం విషయంలో పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు
గత ప్రభుత్వ హయాంలో అంటే 2019 నుంచి 2024 మధ్య కాలంలో ప్రతి గ్రామంలో ఉండే సచివాలయాల నుంచి కేవలం నామమాత్రపు ఫీజు రూ.60 నుంచి రూ.100 లోపు చెల్లిస్తే సాయంత్రానికల్ల మన చేతిలో ఉండేది. కానీ ఇప్పుడు సచివాలయాల్లో క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకోవడం కష్టం అవుతుందని తెలుస్తోంది. సచివాలయాల్లో సర్వర్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
(ఇది కూడా చదవండి: పోస్టాఫీస్ ఎఫ్‌డీ X ఎస్‌బీఐ ఎఫ్‌డీ.. ఈ రెండింటిలో ఏది మంచిది?)
ఎంఆర్వో కార్యాలయాల్లో క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, గతంలోలా పరిస్థితులు లేవని క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం అప్లయి చేసుకున్న పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తు చేసిన తేదీ నుండి 15 రోజుల తర్వాత మాత్రమే సర్టిఫికేట్ జారీ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోండి ఇలా..?
- దరఖాస్తుదారు తమ ప్రాంతంలోని సమీపంలోని మీసేవా కేంద్రాన్ని సంప్రదించాలి.
- అక్కడ ఎస్సీ, ఎస్టీ,బీసీ, ఓబీసీ కమ్యూనిటీ అభ్యర్థులకు ప్రత్యేక దరఖాస్తు ఫారమ్‌లు ఉంటాయి. వాటిని తీసుకోవాలి.
- కార్యాలయం నుండి కుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు ఫారమ్‌ను పొందిన తర్వాత నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి.
- అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్‌లతో పాటుగా మీసేవా ఆపరేటర్‌కు సూచించిన ఫార్మాట్‌లో దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి.
- దరఖాస్తు చేసిన తర్వాత, దరఖాస్తుదారు దరఖాస్తు ఫారమ్‌తో పాటు పేర్కొన్న పత్రాలను జతచేయాలి.
- అనంతరం ఆన్ లైన్ లో క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం మీ రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తయినట్లుగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ను ఉపయోగించి మీరు మీ క్యాస్ట్ సర్టిఫికెట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
- మీసేవా వ్యక్తి ఆన్‌లైన్‌లో కుల ధృవీకరణ కోసం అభ్యర్థనను సంబంధిత అధికారికి ఫార్వార్డ్ చేస్తారు. సంబంధిత శాఖ కుల ధృవీకరణ అభ్యర్థనను ప్రాసెస్ చేస్తుంది. సంబంధిత శాఖ అధికారులు పూర్తిగా పరిశీలించిన తర్వాత కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తారు.
కుల ధృవీకరణ దరఖాస్తు ఫారమ్ స్టేటస్ తెలుసుకోండి ఇలా..?
- మీసేవా పోర్టల్‌ను మళ్లీ ఓపెన్ చేయండి.
- మీ లావాదేవీ ఐడీ లేదా అప్లికేషన్ నంబర్‌ను ఎంటర్ చేసింది. ఎంటర్ బటన్ పై క్లిక్ చేయండి.
- ఇక్కడ మీరు క్యాస్ట్ సర్టిఫికెట్ స్టేటస్ గురించి తెలుసుకోవచ్చు.