Change Aadhaar Mobile Number in Online: మన దేశంలో ఆధార్ కార్డుకు ఉన్న ప్రాముఖ్యత గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏ చిన్న పనికైనా ఇప్పుడు ఆధార్ కావాల్సిందే. అలాంటి ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్ సరిగ్గా ఉండాలి. లేదంటే ఎన్నో చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
(ఇది కూడా చదవండి: Update Aadhaar Card in Online: ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోండిలా..?)
ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలు సైతం ఆధార్‌తో నిర్వహిస్తున్నందున మొబైల్‌కు వచ్చే ఓటీపీ అనేది చాలా ముఖ్యం. అయితే, మీరు ఇప్పటి వరకు ఆధార్‌కు మొబైల్ నెంబర్ లింకు చేయకపోతే ఇప్పుడు సులభంగానే మీరు నెంబర్ లింకు చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆన్‌లైన్‌లో ఆధార్ మొబైల్ నంబర్ ఎలా మార్చుకోవాలి?
- ముందుగా మీరు ఇండియన్ పోస్ట్ సర్వీసెస్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- ఆ తర్వాత మీ పేరు, అడ్రస్, మొబైల్ నంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి.
- ఆ తర్వాత సర్వీస్ సెక్షన్‌లో కిందకు వెళ్తే పీపీబీ ఆధార్ సర్వీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
- ఇప్పుడు UIDAI-Mobile/Email to Aadhaar linking/update ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని.. వివరాలు అన్ని ఇచ్చిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి.
- తర్వాత కన్ఫామ్ సర్వీస్ రిక్వెస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకో రిఫరెన్స్ నంబర్ జనరేట్ అవుతుంది. దాని ద్వారా భవిష్యత్తులో అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
- సంబంధిత అధికారి మీ అప్లికేషన్ వెరిఫై చేసి మిమ్మల్ని సంప్రదిస్తారు.
- తర్వాత దీనికి సంబంధించిన ఫీజు చెల్లించడంతో ప్రాసెస్ పూర్తవుతుంది. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్ మారుతుంది.
ఆఫ్‌లైన్ విధానంలో ఎలా మార్చుకోవాలి?
- మీరు మీ దగ్గర్లోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రానికి వెళ్లాలి.
- ఆధార్ అప్డేట్ లేదా కరెక్షన్ పామ్ తీసుకుని మీ కొత్త మొబైల్ నంబర్‌తో పాటు మిగతా వివరాలన్ని నింపి అందించాలి.
- మీ బయోమెట్రిక్ ద్వారా మీ వివరాలను అథెంటికేట్ చేస్తారు.
- మీరు ఇందుకోసం రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.
- మీ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకో అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ వస్తుంది. అదే మీ అప్డేట్ రిక్వెస్ట్ నంబర్.
- 30 రోజుల్లోగా మీ మొబైల్ నంబర్ మారుతుంది. యూఆర్ఎన్ నంబర్ ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
టెక్ పాఠశాల తాజా వార్తల కోసం ఇప్పుడే ఈ లింకు http://bit.ly/45sSz9h క్లిక్ చేయండి!