Aadhaar Mobile Number Link Status: మన దేశంలో ఆధార్ కార్డుకు ఉన్న ప్రాముఖ్యత గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం చాలా ముఖ్యమైన పనులకు ఆధార్ నెంబర్ కావాల్సిందే. అందుకే ప్రతి ఒక్కరూ వారి ఆధార్ కార్డులో Aadhaar Card వివరాలు కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోవడంతో పాటు ఆధార్‌తో మొబైల్ నెంబర్ లింక్ అయిందో లేదో తెలుసుకోవాలి.
(ఇది కూడా చదవండి: ఆన్‌లైన్‌లో ఆధార్ మొబైల్ నంబర్ ఎలా మార్చుకోవాలి?)
లేకపోతే, కీలక సర్వీసులను పొందలేకపోయే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో కొందరికి వారి ఆధార్‌తో ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో గుర్తు ఉండకపోవచ్చు. అయితే, ఇలాంటి సమయంలో మీరు ఎలాంటి కంగారూ పడాల్సిన అవసరం లేదు. మన ఆధార్‌తో ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో తెలుసుకునే అవకాశాన్ని యూఐడీఏఐ కల్పించింది. అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఆధార్‌కు ఏ మొబైల్ నంబర్ లింకు చేశారో తెలుసుకోండిలా..
- ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్(UIDAI)ను సందర్శించండి.
- ఇప్పుడు My Aadhaar సెక్షన్‌లో Aadhaar Servicesలో Verify Email / Mobile Number అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ నమోదు చేయాలి.
- ఆ తర్వాత క్యాప్చా కోడ్ నమోదు చేసి Send OTP మీద క్లిక్ చేయాలి.
- మీరు సరైన మొబైల్ నెంబర్ నమోదు చేస్తే The Mobile number you have entered is already verified with our records అని వస్తుంది.
- ఆధార్ కు లింక్ లేని నంబర్‌ను నమోదు చేస్తే The Mobile number you have entered does not match with our records అని వస్తుంది.
- ఇలా వస్తే గనుక మరో నెంబర్‌తో ట్రై చేయాలి.
- ఇలాగే ఈ-మెయిల్ ఐడీని కూడా వెరిఫై చేయవచ్చు.
ఒకవేళ, మీకు అసలు ఏ మొబైల్ నెంబర్ ఆధార్‌తో లింకు అయ్యిందో ఐడియా కూడా లేకపోతే, ఆ మొబైల్ నెంబర్ గురించి కూడా తెలుసుకునే అవకాశం ఉంది.
- ముందుగా కొత్త యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్(UIDAI)ను ఓపెన్ చేయండి.
- ఇప్పుడు Check Aadhaar Validity అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ నమోదు చేసి Proceed మీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ Aadhaar Number xxxxxxxxxxxx Exists అని వస్తుంది.
- అలాగే, మీ జెండర్, రాష్ట్రం పేరుతో పాటు మొబైల్ నెంబర్ చివరి 3 అంకెలు కనిపిస్తాయి.
- ఒకవేళ మొబైల్ నెంబర్ స్థానంలో ఖాళీగా ఉంటే ఆ ఆధార్ నంబర్‌కు ఏ ఫోన్ నంబర్ లింక్ చేయలేదని అర్థం.