Thursday, November 21, 2024
HomeHow ToIncome Tax Refund Status Check: ఇన్‌కమ్ ట్యాక్స్​ రిఫండ్​ స్టేటస్​ ఎలా చెక్​ చేసుకోవాలి?

Income Tax Refund Status Check: ఇన్‌కమ్ ట్యాక్స్​ రిఫండ్​ స్టేటస్​ ఎలా చెక్​ చేసుకోవాలి?

Check Income Tax Refund Status in Telugu: వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు గత ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఐటీ రిటర్నుల ఫైలింగ్​ గడువు జులై 31తో ముగిసింది. ఇప్పటికే ముందుగా రిటర్నులు దాఖలు చేసిన కొందరికి రిఫండ్‌లు కూడా క్రెడిట్‌ అవుతున్నాయి. మీరు ఐటీ రిటర్నుల ఫైలింగ్ చేసి ఉంటే.. ఈ కథనంలో ఆన్​లైన్​లో రీఫండ్​ స్టెటస్​ ఎలా చెక్​ చేసుకోవాలో తెలుసుకుందాం..

(ఇది కూడా చదవండి: Home Loan Tax Benefits: గృహ రుణంపై ఆదాయపు పన్ను రాయితీ పొందడం ఎలా..?)

ఐటీఆర్ రిఫండ్​ స్టేటస్​ ఎలా చెక్​ చేసుకోవాలి?

  • మొదట https://eportal.incometax.gov.in/iec/foservices/#/loginలో లాగిన్​ అవ్వాల్సి ఉంటుంది.
  • ఇప్పుడు ‘మై అకౌంట్​’కు వెళ్లి.. రీఫండ్​/ డిమాండ్​ స్టేటస్​ మీద క్లిక్​ చేయాలి.
  • ఆ తర్వాత డ్రాప్​ డౌన్​ మెనూలోకి వెళ్లి ‘Income Tax Returns’ సెలెక్ట్​ చేసుకుని ‘సబ్మిట్​’ బటన్ మీద​ ప్రెస్​ చేయండి.
  • మీ అక్నాలెడ్జ్​ నెంబర్​ మీద క్లిక్​ చేయాల్సి ఉంటుంది.
  • ఇప్పుడు కొత్త వెబ్​ పేజ్​ ఓపెన్​ అవుతుంది. మీ ఐటీఆర్​ వివరాలన్నీ అందులో కనిపిస్తాయి. అక్కడే రీఫండ్​ డేట్​ కూడా ఉంటుంది.

పాన్​ నెంబర్​తో ఐటీఆర్ రిఫండ్​ స్టేటస్​ ఎలా చెక్​ చేసుకోవాలి?

కేవలం మనం పాన్​ నెంబర్ సహాయం​తోనూ ఐటీఆర్​ రీఫండ్​ స్టేటస్​ను చెక్​ చేసుకోచ్చు. అది ఏ విధంగానో ఇప్పుడు తెలుసుకుందాం..

  • ముందుగా https://tin.tin.nsdl.com/oltas/servlet/RefundStatusTrack లింకు ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు పాన్ కార్డు నెంబర్ నమోదు చేసి, అసెస్​మెంట్​ ఇయర్​ 2022-23గా సెలక్ట్​ చేసుకోండి.
  • ఆ తర్వాత సబ్మిట్​ బటన్​ క్లిక్​ చేయాలి.
  • మీ రీఫండ్​ స్టేటస్​ కనిపిస్తుంది.

ప్రస్తుతం.. ఐటీ రిటర్నులు ఫైల్​ దాఖలు చేసిన 10 రోజులకు రీఫండ్​ స్టేటస్​ను చెక్ చేసుకునే వెసులుబాటును ఆదాయపు పన్ను శాఖ కల్పిస్తోంది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles