Saturday, March 7, 2026
HomeHow ToBhu Bharati Portal: భూభారతి పోర్టల్‌లో భూమి మార్కెట్ విలువ తెలుసుకోండి ఇలా..?

Bhu Bharati Portal: భూభారతి పోర్టల్‌లో భూమి మార్కెట్ విలువ తెలుసుకోండి ఇలా..?

How to Check Land Market Value in Bhu Bharati Portal: తెలంగాణలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్ తీసుకొని వచ్చింది. ఈ పోర్టల్ ద్వారా మన భూమికి సంబంధించిన పలు వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. సాధారణంగా మన రాష్ట్రంలో ఉన్న భూములకు ప్రభుత్వం మార్కెట్ విలువను నిర్ధారిస్తుంది అనే సంగతి తెలిసిందే. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఈ మార్కెట్ విలువ ఉంటుంది. ఒక ప్రాంతంలో ఒకలా ఉంటే… మరో ప్రాంతంలో మరో విధంగా ఉంటాయి.

అయితే ఈ తరహా భూమి మార్కెట్ విలువ వివరాలను భూ భారతి పోర్టల్ ఆధారంగా సులభంగా తెలుసుకునే వీలు ఉంటుంది. భూమి ఉన్న ప్రాంతం వివరాలను నమోదు చేసి వివరాలను పొందవచ్చు. ఇప్పుడు ఈ కథనంలో మనం దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

భూభారతి పోర్టల్‌లో భూమి మార్కెట్ వాల్యూ వివరాలను ఇలా చెక్ చేసుకోండి:

  • మొదట భూభారతి అధికారిక పోర్టల్ bhubharati.telangana.gov.in/ ఓపెన్ చేయండి.
  • హోం పేజీలో కనిపించే సమాచార సేవల్లోకి((nformation Services) వెళ్లాలి. ఇక్కడ మార్కెట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్స్(Market Value of Lands) అనే ఆప్షన్ ఉంటుంది.
  • ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఇక్కడ జిల్లా, మండలం, గ్రామ వివరాలను నమోదు చేయాలి. అంతేకాకుండా మీరు ఏ సర్వే నెంబర్ మార్కెట్ వాల్యూను తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ నెంబర్’ను నమోదు చేయాలి.
  • ఆ తర్వాత మీరు Captcha కోడ్’ను నమోదు చేస్తే Fetch మీద క్లిక్ చేస్తే మీకు ఆ భూమి మార్కెట్ విలువ చూపిస్తుంది.
  • అలాగే కింద మీరు Click Here to Download Market Value Assistance Certificate అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మార్కెట్ వాల్యూ వివరాలతో కూడిన పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి దాని కాపీని మీరు పొందవచ్చు.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles