Pan Card New/Correction Online Application Status: పాన్ కార్డు(పర్మనెంట్ అకౌంట్ నెంబర్) ప్రస్తుత పరిస్థితులల్లో చాలా కీలకమైన ధ్రువీకరణ పత్రం. ఆదాయపు పన్ను శాఖ ఈ పాన్ కార్డును జారీ చేస్తుంది. ఈ కార్డుపై 10 అంకెలు ఉంటాయి. వ్యక్తి లేదా కంపెనీ ఎవరైనా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో పాన్ కార్డు పొందటం చాలా సులభతరమైంది. ఆన్‌లైన్‌లో సులభంగానే కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
లామినేటెడ్ రూపంలోని పాన్ కార్డు డెలివరీకి సాధారణంగా 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. అప్లికేషన్ సబ్‌మిట్‌కు మూడు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ-కేవైసీ అండ్ ఈ-సైన్(పేపర్‌లెస్), ఈ-పైన్, ఫిజికల్ డాక్యుమెంట్ అనే మూడు మార్గాల్లో పాన్ అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయవచ్చు. ఈ-కేవైసీ అండ్ ఈ-సైన్(పేపర్‌లెస్) విధానంలో ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది.
(ఇది కూడా చదవండి: Pan card: మీ పాన్ కార్డు పోయిందా? ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా!)
ఈ-సైన్ ఆప్షన్‌లో ఫోటో, సిగ్నేచర్, ఇతర డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫిజికల్ డాక్యుమెంట్ ఆప్షన్‌లో పాన్ అప్లికేషన్‌ను ఎన్‌ఎస్‌డీఎల్‌కు ఫార్వర్డ్ చేయాలి. పాన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నాక పాన్ కార్డు దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్త/కరెక్షన్ పాన్ కార్డు దరఖాస్తు స్టేటస్ తెలుసుకోండి ఇలా..?
- మొదట మీరు https://tin.tin.nsdl.com/pantan/StatusTrack.html లింకు ఓపెన్ చేయండి.
- ఆ తర్వాత అప్లికేషన్ టైపులో పాన్ కార్డు ఎంచుకోవాలి.
- ఆ తర్వాత అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ టైపు చేసి క్యాప్చ కోడ్ నమోదు చేయండి.
- ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు.