Wednesday, December 18, 2024
HomeHow ToDigital Ration Card: డిజిటల్ రేషన్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

Digital Ration Card: డిజిటల్ రేషన్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

Digital Ration Card Download: జాతీయ ఆహార భద్రతా చట్టం(NFSA) కింద ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి సబ్సిడీ ఆహార ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి దేశంలోని అర్హత ఉన్న పేద ప్రజల కుటుంబాలకు భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఒక అధికారిక పత్రమే ఈ రేషన్ కార్డులు. ఈ రేషన్ కార్డులు చాలా మంది భారతీయులకు సాధారణ గుర్తింపు పత్రాలుగా కూడా పనిచేస్తాయి.

అయితే, ఇలాంటి రేషన్ కార్డులను ఆన్‌లైన్‌లో లేదా మేరా రాషన్ 2.0 యాప్ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే, రేషన్ కార్డ్ హోల్డర్‌లకు పీఈఎస్‌ సేవలను సులభంగా యాక్సెస్ చేసుకొని వచ్చేందుకు ఈ యాప్ తీసుకొచ్చారు.

మీ డిజిటల్ రేషన్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

  • మొదట Android వినియోగదారులు: Google Play Store నుంచి మేరా రాషన్ 2.0 యాప్’ని డౌన్‌లోడ్ చేసుకోండి.
  • iOS వినియోగదారులు: Apple App Store నుంచి మేరా రాషన్ 2.0 యాప్’ని డౌన్‌లోడ్ చేసుకోండి.
  • ఆ తర్వాత అప్లికేషన్ ఓపెన్‌ చేయండి.
  • స్క్రీన్‌పై చూపిన మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.
  • “ధృవీకరించు” బటన్‌ను క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక OTP వస్తుంది.
  • ఓటీపీ నమోదు చేసి, “ధృవీకరించు”పై క్లిక్ చేయండి.
  • ధృవీకరణ తర్వాత, మీ డిజిటల్ రేషన్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. డౌన్‌లోడ్ చేయండి. ప్రింట్ తీసుకొని సేవ్ చేసుకోండి.

డిజిటల్ రేషన్ కార్డ్ ప్రయోజనాలు:

  • మీరు దీన్ని ఎక్కడైనా, ఎప్పుడైనా ఉపయోగించవచ్చు.
  • ఫిజికల్ కార్డ్ పోతుందనే భయం ఉండదు.
  • రికార్డులన్నీ డిజిటల్‌గా ఉండడంతో మోసం జరిగే అవకాశాలు తక్కువ.
  • మీ ఈ-రేషన్ కార్డును ఎలా ధృవీకరించాలి.
  • మీరు మీ ఈ-రేషన్ కార్డ్ సమాచారాన్ని తనిఖీ చేయాలనుకుంటే, మీ రాష్ట్ర ఆహార, ప్రజా సంక్షేమ శాఖను సందర్శించండి.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles