Saturday, March 7, 2026
HomeHow Toమీ ఆస్తి నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందా? తెలంగాణలో గ్రీవెన్స్ కోసం ఎలా ఫైల్ చేయాలి?

మీ ఆస్తి నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందా? తెలంగాణలో గ్రీవెన్స్ కోసం ఎలా ఫైల్ చేయాలి?

తెలంగాణ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ భూభారతి పోర్టల్ ద్వారా మనం మన భూమికి సంబంధించిన అనేక సేవలను పొందవచ్చు. ఈ సేవలలో భాగంగా మీ భూమి గనుక నిషేధిత ఆస్తుల జాబితా(Prohibited Properties List)లో చూపిస్తే. నిషేధిత ఆస్తుల జాబితా నుంచి మీ భూమి ఎలా తొలగించుకోవలో ఈ కథనంలో తెలుసుకుందాం.

🔑 స్టెప్ 1: భూభారతి పోర్టల్‌లో లాగిన్ లేదా రిజిస్ట్రేషన్

  • మొదట అధికారిక 👉 భూభారతి పోర్టల్ ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు Login బటన్‌పై క్లిక్ చేయండి.
  • మీరు గనుక కొత్త యూజర్ అయితే → Signupపై క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వాలి(యూజర్ రిజిస్ట్రేషన్ మాన్యువల్ చూసుకోవచ్చు).
  • ఇప్పటికే రిజిస్టర్ అయితే → మీ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి Get OTP పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
  • OTP ఎంటర్ చేసి Validate OTP పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత మీ Citizen Dashboard ఓపెన్ అవుతుంది.

📝 స్టెప్ 2: గ్రీవెన్స్ సర్వీస్‌ను ఎంచుకోవడం

  • డాష్‌బోర్డ్‌లో ROR Corrections మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు Grievance relating to inclusion in prohibited properties list పై క్లిక్ చేయండి.
  • పౌరులకు సంబంధించిన ఫ్లోస్ చూపబడతాయి. వాటిని చదివి Proceed అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

📑 స్టెప్ 3: ఆస్తి వివరాలు ఇవ్వడం

  • ఆ తర్వాత మీకు మాడ్యూల్‌కు సంబంధించిన సమాచారం వస్తుంది. Click Here to Continueపై క్లిక్ చేయండి.
  • మీ వద్ద పాస్‌బుక్ నంబర్ (PPB No.) ఉందా అని అడుగుతుంది:
  • ఉంటే → PPB నంబర్ ఎంటర్ చేసి Fetch పై క్లిక్ చేయండి.
  • లేకపోతే → అవసరమైన వివరాలు ఎంటర్ చేసి Fetch పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.
  • ఫిర్యాదు చేయాల్సిన సర్వే నంబర్ ను ఎంచుకొని, కారణం రాసి Continueపై క్లిక్ చేయండి.

⚖️ స్టెప్ 4: గ్రీవెన్స్ దాఖలు చేయడం

  • Do you want to remove Survey Number from CARD prohibited list? అనే ఆప్షన్ వస్తుంది. Yes/No ఎంచుకోండి.
  • సర్వే నంబర్‌ను ఎందుకు తొలగించాలనుకుంటున్నారో కారణం రాయండి.
  • మీ కమ్యూనికేషన్ వివరాలు మరియు డాక్యుమెంట్ వివరాలు ఎంటర్ చేయండి.
  • అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి Submitపై క్లిక్ చేయండి.

📩 స్టెప్ 5: ధృవీకరణ & సమర్పణ

  • సబ్మిట్ చేసిన తర్వాత ఒక Confirmation Pop-up వస్తుంది. ఇప్పుడు OKపై క్లిక్ చేయండి.
  • మీ అప్లికేషన్ విజయవంతంగా సమర్పించబడుతుంది.
  • ఒక Application Number జనరేట్ అవుతుంది.
  • ఈ అప్లికేషన్ MeeSeva వద్ద eKYC కోసం పెండింగ్‌లో ఉంటుంది.
  • OKపై క్లిక్ చేసి మీ సేవ దగ్గరికి వెళ్ళి eKYC పూర్తిచేయండి.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles