PAN – Aadhaar Link After June 30: పాన్ కార్డును ఆధార్‌తో(PAN-Aadhaar Link) లింకు చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసిన సంగతి తెలిసిందే. జూన్ 30లోగా ఎవరైతే జరిమానా చెల్లించి PAN- Aadhaar link చేస్తారో వారి పాన్ ఎప్పటిలానే పనిచేస్తుంది. అయితే, గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయని వారి పాన్ కార్డులు నిరుపయోగం కానున్నాయని ఇది వరకే ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.
ప్రస్తుతం, పాన్-ఆధార్ గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం ఈసారి గడువు పొడిగించలేదు. దీంతో పాన్ కార్డు దారులు ఏం చేయాలో తెలియడం లేదు. అయితే, పాన్ కార్డులను మళ్లీ యాక్టివేట్ చేసుకునేందుకు ఇంకో అవకాశం మిగిలే ఉంది. ఎవరైతే 2023 జూన్ 30లో పాన్ – ఆధార్ లింకు చేయలేదో వారు పెనాల్టీ చెల్లించి తమ పాన్ కార్డును తిరిగి పునరుద్ధరించుకోవచ్చు.
అయితే, పాన్ కార్డు ఈసారి తిరిగి ఆక్టివేట్ అవ్వడానికి 30 రోజుల సమయం పడుతుంది. ఈలోపు నిరుపయోగంగా మారిన కారణంగా పాన్ కార్డును ఎక్కడ కూడా వినియోగించలేరు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది మార్చి 28న కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఓ నోటిఫికేషన్ జారీ చేసింది.
(ఇది కూడా చదవండి: Pan card: మీ పాన్ కార్డు పోయిందా? ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా!)
ఎవరైతే, రూ.1000 ఫైన్ చెల్లించి ఆధార్ అధికారులకు ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింకు చేయలేదని వెల్లడిస్తే 30 రోజుల తర్వాత పాన్ కార్డును తిరిగి ఆక్టివేట్ కానున్నట్లు కేంద్రం పేర్కొంది. సీబీడీటీ నోటిఫికేషన్ ప్రకారం.. ఇప్పటికీ రూ.1000 చెల్లించి మీ పాన్ కార్డును వినియోగించుకోవచ్చు.
ఉదాహరణకు జరిమానా చెల్లించి జులై 10న ఎవరైనా పాన్ లింక్ కోసం దరఖాస్తు చేసిన తర్వాత ఆ కార్డు ఆగస్టు 9న నాటికి ఆ కార్డును పునరుద్ధరిస్తారు. అయితే, అప్పటి వరకు పాన్ కార్డు నిరుపయోగంగా మారుతుంది. గడువులోగా పాన్-ఆధార్ లింక్ చేయని పన్ను చెల్లింపుదార్లకు రిఫండ్ రాదని, పాన్ పని చేయని కాలానికి రిఫండ్‌పై వడ్డీ చెల్లించరని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది.
అటువంటి పన్ను చెల్లింపుదారులు నుంచి ఎక్కువ మొత్తంలో టీడీఎస్, టీసీఎస్ వసూలు చేస్తారని ఐటీ శాఖ గతంలో తెలిపింది. ఒకవేళ మీరు డెడ్‌లైన్ మిస్ అయ్యి ఉంటే.. ఈ ఫైలింగ్ పోర్టల్‌లోని ఈ-పే ట్యాక్స్ విభాగంలోకి వెళ్లి జరిమానా చెల్లించి పాన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
పాన్-ఆధార్ లింక్ స్టేటస్ తెలుసుకోవడం ఎలా..?
- మొదట ఆదాయపు పన్ను శాఖ అధికారిక పోర్టల్ ఓపెన్ చేయండి.
- ఎడమ వైపు క్విక్ లింక్స్ విభాగంలో Link Aadhaar Status అని కనిపించే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
- ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ పాన్, ఆధార్ నంబర్ నమోదు చేసి View Link Aadhaar Status మీద క్లిక్ చేయండి
- ఆ తర్వాత మీ పాన్-ఆధార్ లింక్ అయిందో లేదో మీకో Popupలో కనిపిస్తుంది.