Monday, October 7, 2024
HomeReal Estateభూమి కొలతలు: అంగుళం(Inch), అడుగు(Foot), గజం(Yard) అంటే ఎంత?

భూమి కొలతలు: అంగుళం(Inch), అడుగు(Foot), గజం(Yard) అంటే ఎంత?

Land Measurements: భూమి కొలతలు(Bhoomi Kolathalu Telugu): మన దేశంలో భూమి, ఆస్తి వైశాల్యాన్ని కొలవడానికి వివిధ రకాల యూనిట్లు ఉపయోగిస్తారు. భారతదేశం అంతటా ప్రతి రాష్ట్రంలో భూమిని కొలవడానికి ఉపయోగించే పదాల అర్ధాలు చాలా భిన్నంగా ఉంటాయి. మీరు ఆస్తిని కొనుగోలు చేయడానికి ముందు మీరు భూమి కొలత యూనిట్ల గురించి బాగా అర్థం చేసుకోవాలి. అలాగే, ఎల్లప్పుడూ మీరు స్వంతంగా స్థల వైశాల్యం కొలిచెవిదంగా ఉండాలి, బిల్డర్‌ను ఎప్పుడు నమ్మవద్దు.

ఇప్పుడు మనం మన 2 తెలుగు రాష్ట్రాల్లో భూమిని కొలవడానికి ఉపయోగించే పదాల గురుంచి తెలుసుకుందాం. ఈ పదాల గురుంచి తెలుసుకోవడం వల్ల భూమిని కొనేటప్పుడు జరిగే నష్టాన్ని నివారించుకోవచ్చు.

ఇల్లు, ఆస్తి, భూమిని కొలవడానికి ఉపయోగించే పదాలు?

  • అంగుళం(Inch)
  • అడుగు(Foot)
  • చదరపు అడుగు(Square Feet)
  • గజం(Yard)
  • చదరపు గజం(Square Yard)
  • గుంట(Gunta)
  • ఎకరం (Acre)
  • అంకణం (Anakanam)
  • సెంటు (Cent)
  • హెక్టారు (Hectare)

అంగుళం(Inch) అంటే ఎంత?

ఒక అంగుళం(1 inch) అంటే 2.54 సెంటీమీటర్లకు సమానం.

అడుగు(Inch) అంటే ఎంత?

ఒక అడుగు(1 foot) = 30.48 సెంటి మీటర్లు, 12 అంగుళాలు (Inches)

- Advertisement -

చదరపు అడుగు (Square feet) అంటే ఎంత?

ఒక చదరపు అడుగు (Square feet) = 929.03 సెంటి మీటర్లు(centimeters), 144 అంగుళాలు(inches)

గజం(1 yard) అంటే ఎంత?

ఒక గజం(1 yard) = 3 అడుగులు(foot)

చదరపు గజం(Square yard) అంటే ఎంత?

ఒక చదరపు గజం(Square yard) = 9 చదరపు అడుగులు(Square feet)

ఉదా: 1350 చదరపు అడుగుల స్థలం అంటే 150 చదరపు గజాల స్థలం అని అర్ధం.
1350 Square Feet/9 = 150 Sq.yards

మనం ఇల్లు కంటే సమయంలో బిల్డర్ ఒక అడుగుకి చార్జ్ వేస్తారు.. అంటే ఇక్కడ 150 చదరపు గజాల స్థలంలో ఒక ఫ్లోర్ నిర్మించడానికి(1350 * 1600 = Rs 21,60,000) సుమారు రూ. 22,00,00 అవుతుంది.

- Advertisement -

గుంట అంటే ఎంత?

ఒక గుంట = 121 చదరపు గజాలు, 121*9 = 1089 చదరపు అడుగులు

ఎకరం(Acre) అంటే ఎంత?

ఒక ఎకరం = 40 గుంటలు, 4840 చదరపు గజాలు, 43560 చదరపు అడుగులు

అంకణం అంటే ఎంత?

ఒక అంకణం = అంకణం అంటే 12 అడుగుల పొడవు x 6 అడుగుల వెడల్పు. లేదా 72 చదరపు అడుగులు లేదా ఒక అంకణం = 8 గజాలతో సమానం
1 ఎకరం = 605.0 అంకణంలు = 4840 చదరపు గజములు = 43560 చదరపు అడుగులు

సెంటు అంటే ఎంత?

ఒక సెంటు = 48.4 చదరపు గజములు. 1 చదరపు గజము = 9 అడుగులు
ఎకరం = 100 సెంట్లు, 4840 చదరపు గజములు, 43560 చదరపు అడుగులు

హెక్టారు అంటే ఎన్ని ఎకరాలు?

1 హెక్టారు = 2.47105 ఎకరాలు(Acres)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles