How To Pay Property Tax in Online Telugu: ప్రజలు తమ ఆధీనంలో ఉన్న భూమి. ఇల్లు మీద స్థానిక సంస్థలు లేదా ప్రభుత్వానికి వార్షికంగా చెల్లించే పన్నునే ప్రాపర్టీ ట్యాక్స్ అని అంటారు. మీ ఇంటి విలువను మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీ వంటి స్థానిక సంస్థలు మదింపు చేసి దాని ఆధారంగా మీరు ఏడాదికి ఎంత పన్ను చెల్లించాలో నిర్దేశిస్తాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC)లోనూ పైన పేర్కొన్న విధంగానే ఆస్తి పన్నును మదింపు చేసి బల్దియా అధికారులు ఆ పన్నును వసూలు చేస్తారు. స్థానిక సంస్థలు, మీ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ పన్నును ప్రతి ఏడాది వసూలు చేస్తాయి.
(ఇది కూడా చదవండి: House Buying Tips: ఇల్లు కొనే ముందు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?)
అయితే ఇప్పుడు మీరు గనుక GHMC పరధిలో ఉండి ప్రాపర్టీ ట్యాక్స్(Property Tax) చెల్లించడం కోసం నగరంలో ఎక్కడో ఉన్న కార్యాలయానికి వెళ్తున్నారా?.. ఇక మీరు పన్ను చెల్లించడం ఎక్కడికో వెళ్ళకుండా.. ఉన్న చోటు నుంచే సులభంగా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
GHMC ఆస్తిపన్ను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలి..?
- మీరు ఆన్‌లైన్‌లో ఆస్తి పన్ను చెల్లించడానికి https://ghmc.gov.in/ని ఓపెన్ చేయాలి
- అనంతరం ‘Online Payments’ అనే ట్యాబ్‌ని ఎంచుకుని ‘Property Tax’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీ PTIN(ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య), రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి OTP మీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు చెల్లించాల్సిన బకాయిలు, వాటిపై వడ్డీ, సర్దుబాట్లు, ఆస్తి పన్ను ఇలా ప్రాపర్టీ ట్యాక్స్‌కు సంబంధించిన వివరాలన్నీ మీకు కనిపిస్తాయి.
- ఆ తర్వాత, మీరు పన్నును ఏ విధంగా చెల్లిస్తారో అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- నెట్ బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి ఈ ప్రాపర్టీ ట్యాక్స్ను కట్టవచ్చు.
- మీ చెల్లింపు సక్సెస్ అయ్యాక మీకు ఒక రశీదు వస్తుంది.
- ఇలా సులభంగా ఆన్‌లైన్‌లో GHMCలో మీ ఆస్తి పన్నును చెల్లించవచ్చు.
మునిసిపల్ కార్పొరేషన్‌కు(CDMA) ఆన్‌లైన్‌లో ఎలా ఆస్తి పన్ను చెల్లించాలి..?
- మీరు ఆన్‌లైన్‌లో ఆస్తి పన్ను చెల్లించడానికిhttps://emunicipal.telangana.gov.in/ని ఓపెన్ చేయాలి
- అనంతరం ‘Online Payments’ అనే ట్యాబ్‌ని ఎంచుకుని ‘Property Tax (House Tax)’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీ PTIN (ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య) నంబర్‌ను నమోదు చేసి Know Property Tax Dues మీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు చెల్లించాల్సిన బకాయిలు, వాటిపై వడ్డీ, సర్దుబాట్లు, ఆస్తి పన్ను ఇలా ప్రాపర్టీ ట్యాక్స్‌కు సంబంధించిన వివరాలన్నీ మీకు కనిపిస్తాయి.
- ఆ తర్వాత, మీరు పన్నును ఏ విధంగా చెల్లిస్తారో అనే ఆప్షన్‌ను ఎంచుకొని పన్ను చెల్లించాలి.
- మీ చెల్లింపు సక్సెస్ అయ్యాక మీకు ఒక రశీదు, నెంబర్ వస్తుంది.
- ఇలా సులభంగా ఆన్‌లైన్‌లో CDMAలో మీ ఆస్తి పన్నును చెల్లించవచ్చు.