Stamp Duty, Transfer Duty, Registration Fees in Andhra Pradesh: తమ సురక్షితమైన భవిష్యత్తు కోసం ప్రస్తుతం చాలా మంది భూమి కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికోసం రాత్రి, పగలు కష్టపడుతుంటారు. అయితే, ఎంతో విలువైన భూమి కొనేటప్పుడు దాని మీద విధించే రిజిస్ట్రేషన్ ఛార్జీలు తెలియక చాలామంది మోసపోతున్నారు. ఈ స్టోరీలో మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల కొనుగోలు సమయంలో విధించే చార్జీల గురించి తెలుసుకుందాం..
ఏపీలో భూ రిజిస్ట్రేషన్ ధరలు ఎంతో తెలుసా..?
ఏపీలో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు తెలంగాణతో పోలిస్తే కొద్దిగా తక్కువగానే ఉన్నాయి. ఒక వ్యక్తి భూమి కొనేటప్పుడు స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంత అనేది తెలుసుకోవాలి.
పైన పేర్కొన్న చిత్ర ప్రకారం మనం ఏపీలో భూ రిజిస్ట్రేషన్ ధరలు గమనిస్తే.. భూమి విలువ మీద స్టాంప్ డ్యూటీ గరిష్టంగా 5% ఉంటే కనిష్టంగా జీరోగా ఉంది. అలాగే ట్రాన్స్ఫర్ డ్యూటీ 1.5 శాతంగా ఉంది.. ఇంకా రిజిస్ట్రేషన్ ఫీజు అనేది 1 శాతంగా ఉంది.
(ఇది కూడా చదవండి: స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు అంటే ఏమిటి, ఎందుకు వసూలు చేస్తారు?)
అంటే మొత్తం భూమి విలువ మీద 7.5 శాతం రూపంలో ఏపీ ప్రభుత్వం చార్జీలను వసూలు చేస్తుంది. అంటే ఉదా: 10,00,000 విలువ గల భూమి మనం కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ.75,000లను రిజిస్ట్రేషన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఛార్జీలు అనేవి Nature of Document, Consideration Value బట్టి మారుతాయి.