ఎఫ్-లైన్ పిటిషన్(F-Line Petition): భూమి, ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరూ రెవెన్యూ రికార్డులలో ఉన్న పదాల గురించి తెలుసుకోవడం తప్పనిసరి. భూమితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు భూమి రికార్డుల అవసరం పడుతుంది.
(ఇది కూడా చదవండి: సాదాబైనామా, సెటిల్ మెంట్ డీడ్ & సేత్వార్ పహాణి అంటే ఏమిటి?)
ఎందుకంటే భూమికి సంబంధించిన వివిధ వివరాలు ఈ భూమి రికార్డులలో ఉంటాయి. మీరు భూమి ఎంతకాలం నుంచి సాగు చేస్తున్నాము/ అనుభవిస్తున్నాము అనేది రికార్డుల్లో లేకపోతే ఆ భూమిపై చట్టపరంగా హక్కులు పొందలేరు. అందుకే, ప్రతి ఒక్కరూ ఇంతటి ముఖ్యమైన రికార్డుల గురించి తేలుసుకోవడం చాలా ముఖ్యం.
ఎఫ్-లైన్ పిటిషన్ అంటే ఏమిటి?
ఎఫ్-లైన్ పిటిషన్ అంటే మన భూమి రికార్డులో చూపించిన భూమి వాస్తవంగా ఉందా అనేది తెలుసుకోవడం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకునే ఒక ప్రక్రియ. ఇలా దరఖాస్తు చేసుకోవడం వల్ల అసలైన భూ విస్తీర్ణం తెలవడంతో పాటు భూ సరిహద్దులు నిర్దేశించబడుతాయి. భూ విస్తీర్ణంలో ఏదైనా అనుమానం వెంటనే ఎఫ్-లైన్ పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది.
ఎఫ్-లైన్ పిటిషన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- ఈ పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీ సేవకు వెళ్ళండి.
- ఈ పిటిషన్ ఫారంలో మీ పూర్తి వివరాలు నమోదు చేసి మీ సేవలో దరఖాస్తు చేసుకోండి.
- మీరు మీ సేవ ద్వారా ఎఫ్-లైన్ పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాక మీ దరఖాస్తు మండల తహశీల్దార్ కార్యాలయానికి వెళ్తుంది. అక్కడ మీ గ్రామ రెవెన్యూ అధికారి మీ పరిశీలించాక పై అధికారి తహశీల్దార్ కు పంపిస్తారు.
- ఆ తర్వాత అధికారి నుంచి అనుమతి వచ్చాక మండల్ సర్వేయర్ మీ భూమి దగ్గరకు వచ్చి భూమిని కొలిచి హద్దులు నిర్దేశించిన తర్వాత మీకు పట్టా ఇస్తారు. ఈ ఎఫ్-లైన్ పిటిషన్ కోసం ఎకరాకు రూ.1000 రుసుము ఉండవచ్చు. ఈ పని అంత 30 రోజులలో జరుగుతుంది.
ఎఫ్-లైన్ పిటిషన్ కోసం కావాల్సిన దృవపత్రాలు ఏమిటి?
- అర్జీ పత్రం
- భూమి పట్టా పాస్ బుక్ నకలు
- ఆధార్ కార్డు నెంబర్