Sunday, June 30, 2024
HomeReal EstateHome Loan: ఫిక్స్ డ్ హోంలోన్ మంచిదా? ఫ్లోటింగ్ రేట్ హోం లోన్ మంచిదా?

Home Loan: ఫిక్స్ డ్ హోంలోన్ మంచిదా? ఫ్లోటింగ్ రేట్ హోం లోన్ మంచిదా?

మీకో ఓ సామెత గుర్తుండే ఉంటుంది. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు. కానీ ఇప్పుడు, చేతిలో ఏమాత్రం కొద్దిగా డబ్బులుంటే చాలు.. అప్పో సొప్పో చేసి ఇల్లు కొనుగోలు చేస్తున్నారు. నెలవారీ అద్దెల్లుకి ఎంత చెల్లిస్తున్నామో.. అంతకు ఓ ఐదారువేలు అదనంగా వేసి సొంతిట్లో హుందాగా ఉండవచ్చు అని భావించి ప్రతి ఒక్కరూ ఇల్లుకొనాలనే చూస్తున్నారు.

అయితే, ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళి.. హోం లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి రెండు రకాలైన అనుమానాలు తలెత్తుతాయి. అందులో ఒకటి ఫిక్స్ డ్ వడ్డీ తీసుకోవాలా? ఫ్లోటింగ్ వడ్డీ ఎంచుకోవాలా?. ఈ రెండింటిలో ఏ ఆప్షన్ అయితే మంచిది. ఇక్కడే మీరు తీసుకునే నిర్ణయం మీ వ్యక్తిగత జీవితంపై సంవత్సరాలు పాటు ప్రభావం చూపుతుంది.

(ఇది కూడా చదవండి: గృహ రుణంపై ఆదాయపు పన్ను రాయితీ పొందడం ఎలా..?)

అద్దె ఇంట్లో ఉండాలా లేదా? సొంత ఇంట్లో ఉండాలా? అనేది మీ మొదటి నిర్ణయం అయితే. మీరు హోం లోన్ తీసుకున్న తర్వాత మీ వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలని నిర్ణయించేది ఫిక్స్ డ్ లేదా ఫ్లోటింగ్ వడ్డీ రేట్లను నిర్ణయించే హోంలోన్ పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ రెండు వడ్డీ రేట్లలో ఏది మంచిదో హోంలోన్ కోసం అప్లయి చేసుకునే ముందే తెలుసుకోవడం మంచింది.

ఫిక్స్ డ్ వడ్డీ రేటు హోంలోన్, దాని ప్రయోజనాలు

ఫిక్స్ డ్ హోంలోన్ అనేది ఇల్లు తీసుకునే సమయంలో వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది. ఈ ఆప్షన్ ఎంచుకుంటే మీరు ఎంచుకున్న కాలం వరకు వడ్డీ రేట్లు మారకుండా స్థిరంగా ఉంటాయి. ఫిక్స్‌డ్ రేట్ రుణాలు సాధారణంగా ఫ్లోటింగ్ రేట్ లోన్‌ల కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. అలా అనే ఆ రెండింటి మధ్య తేడాలు తెలుసుకోకుండా చాలా మంది ఫ్లోటింగ్ వడ్డీ రేట్లను ఎంచుకుంటారు. కాబట్టే ఫిక్స్‌డ్ రేట్ లోన్ లేదా ఫ్లోటింగ్ రేట్ లోన్‌ని ఎంచుకోవాలా అనేది ముందు తెలుసుకోవాలి.

- Advertisement -

అయితే, గృహ రుణం తీసుకొనేటప్పుడు మీ నెలవారీ జీతంలో మీరు కట్టే ఈఎంఐ 30 శాతం నుంచి 50 శాతానికి మించకూడదు అనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లు ఆదారంగా మీరు ఫిక్స్ డ్ వడ్డీ రేట్లను ఎంపిక చేసుకుంటే భవిష్యత్ లో వడ్డీ రేట్లు పెరిగినా మీ హోంలోన్ పై వడ్డీ రేట్లు పెరగవు. అందుకే మీకు వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం హోంలోన్ చెల్లించేందుకు కేటాయించకూడదు. అందుకే మీరు కేవలం 30 శాతం – 50 శాతం పెరగకుండా చూసుకోవాలి. అదనంగా ఆదాయన్ని పెంచుకునే మార్గాల్ని అన్వేషించండి.

ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్, దాని ప్రయోజనాలు

ఫ్లోటింగ్ రేట్ అనేది బ్యాంకుల బెంచ్‌మార్క్ రేటుపై ఆధారపడి ఉంటాయి. మార్కెట్ ఆధారంగా వడ్డీ రేట్లలో మార్పులు చేర్పులు ఉంటాయి. బెంచ్‌మార్క్ రేటులో మార్పు ఉంటే, రుణంపై వడ్డీ రేటు కూడా మారుతుంది. ఈ లెక్క ప్రకారం.. మీ హోంలోన్ పై వడ్డీ రేట్లు కాలక్రమేణా తగ్గుతాయని మీరు ఆశించినట్లయితే, ఫ్లోటింగ్ రేట్ లోన్‌ను ఎంచుకోవడం వలన మీ లోన్‌కి వర్తించే వడ్డీ రేటు కూడా తగ్గుతుంది, తద్వారా మీ లోన్ ఖర్చు తగ్గుతుంది.

వడ్డీ రేటు కదలికల గురించి ఖచ్చితంగా తెలియని, మార్కెట్ రేట్లకు అనుగుణంగా వడ్డీని చెల్లించేందుకు సిద్దపడుతున్నట్లైతే ఫ్లోటింగ్ రేట్ రుణాలు అనుకూలంగా ఉంటాయి. మీకు ఏ రకమైన హౌసింగ్ లోన్ సరిపోతుందో మీకు ఇంకా తెలియకుంటే, పార్ట్ ఫిక్స్డ్, పార్ట్ ఫ్లోటింగ్ అయిన కాంబినేషన్ లోన్‌ను ఎంచుకోండి. మీరు ప్రస్తుతం ఇతర లోన్లు చెల్లిస్తూ ఉండి.. అవి 3-5 ఏళ్లలో తీర్చేస్తాము అని మీకు అనిపిస్తే ఈ కాంబినేషన్ లోన్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles