ఈ నెల ప్రారంభంలో జరిగిన IFA 202 కార్యక్రమంలో చైనాకు చెందిన రియల్ మీ సంస్థ రియల్ మీ నార్జో 20 పేరిట కొత్త సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో భాగంగా రియల్ మీ నార్జో 20, రియల్ మీ నార్జో 20A, రియల్ మీ నార్జో pro మూడు మోడళ్లను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ మూడు మోడళ్లను నేడు మార్కెట్ లోకి విడుదల చేసింది. రియల్ మీ నార్జో 20 సిరీస్ రియల్ మీ నార్జో 20, 20A, రియల్ మీ నార్జో 20 pro స్మార్ట్ ఫోన్ ల ఫీచర్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

రియల్‌మీ నార్జ్‌ 20ఏ:

రియల్‌మీ నార్జ్‌ 20ఏ మోడల్‌లో క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మీ యుఐ ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. మొత్తం నాలుగు కెమెరాలు ఉన్నాయి. వెనక మూడు, ముందు ఒకటి ఇస్తున్నారు. వెనక వైపు 12 మెగాపిక్సెల్ కెమెరా, 2ఎంపీ రెట్రో సెన్సర్‌ కెమెరా, 2ఎంపీ మోనోక్రోమ్ సెన్సర్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది రివర్స్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 40 రోజుల పాటు స్టాండ్‌బైలో ఉంటుంది. గ్లోరి సిల్వర్‌, విక్టరీ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. 3జీబీ ర్యామ్‌/ 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజి వేరియంట్ ధర రూ. 8,499గాను, 4జీబీ ర్యామ్‌/ 64జీబీ అంతర్గత మెమరీ వేరియంట్ ధర రూ. 9,499గా రియల్‌మీ నిర్ణయించింది. సెప్టెంబరు 30 నుంచి ఫ్లిప్‌ కార్ట్‌, రియల్‌మీ.కామ్‌, ఎంపిక చేసిన స్టోర్లలో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.

డిస్‌ప్లే6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే
ర్యామ్ 3జీబీ, 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్ 32జీబీ, 64జీబీ
ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665
ప్రధాన కెమెరా 12+2+2 మెగాపిక్సెల్
ముందు కెమెరా 8 మెగాపిక్సెల్
బ్యాటరీ 5,000ఎంఏహెచ్ (10వాట్ ఫాస్ట్ + రివర్స్‌ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10 + రియల్‌మీ యూఐ
సిమ్ సపోర్ట్డ్యూయెల్ సిమ్
కలర్స్గ్లోరీ సిల్వర్, విక్టరీ బ్లూ
ధర3జీబీ ర్యామ్‌ + 32జీబీ= 8,499
4జీబీ ర్యామ్‌ + 64జీబీ= 9,499

రియల్‌మీ నార్జ్‌ 20:

రియల్ మీ నార్జో 20 మోడల్‌ ఆండ్రాయిడ్‌ 10 ఆధారిత రియల్‌మీ యుఐ ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.5 అంగుళాల హెచడీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో మొత్తం నాలుగు కెమెరాలు ఉన్నాయి. వెనక మూడు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనక వైపు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 8ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్ కెమెరా, 2ఎంపీ మాక్రో లెన్స్‌ కెమెరా ఇస్తున్నారు. ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు.

నార్జో సిరీస్‌లోనే తొలిసారిగా 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 65వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో పాటు రివర్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 45 రోజుల స్టాండ్‌బైలో ఉంటుంది. 43 గంటలపాటు ఫోన్ మాట్లాడుకోవచ్చు. అలానే యుట్యూబ్‌లో 18 సినిమాలు చూడొచ్చు, 1200 పాటలు వినోచ్చు. గ్లోరి సిల్వర్‌, విక్టరీ బ్లూ రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తుంది. 4జీబీ ర్యామ్‌/64జీబీ ఇంటర్నల్ స్టోరేజి వేరియంట్ ధర రూ.10,499గాను, 4జీబీ ర్యామ్‌/128జీబీ అంతర్గత మెమరీ ధర రూ. 11,499గా కంపెనీ నిర్ణయించింది. సెప్టెంబరు 28 నుంచి ఫ్లిప్‌ కార్ట్‌, రియల్‌మీ.కామ్‌, ఎంపిక చేసిన స్టోర్లలో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.

డిస్‌ప్లే6.5 అంగుళాల హెచడీ+
ర్యామ్ 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్ 64 జీబీ, 128 జీబీ
ప్రాసెసర్ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌ 
ప్రధాన కెమెరా 48+8+2 మెగాపిక్సెల్
ముందు కెమెరా 8 మెగాపిక్సెల్
బ్యాటరీ 6,000 ఎంఏహెచ్(18 వాట్ ఫాస్ట్ + రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10 + రియల్ మీ యూఐ
సిమ్ సపోర్ట్డ్యూయెల్ సిమ్ సపోర్ట్
కలర్స్గ్లోరీ సిల్వర్, విక్టరీ బ్లూ
ధర4జీబీ ర్యామ్ + 64జీబీ = 10,499
4జీబీ ర్యామ్‌ + 128జీబీ= 11,499

రియల్‌మీ నార్జ్‌ 20 Pro:

రియల్ మీ నార్జోలో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అల్ట్రా స్మూత్ డిస్‌ప్లే ఇస్తున్నారు. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌ ఉంది. ఆండ్రాయిడ్‌ 10 ఆధారిత రియల్‌మీ యుఐ ఓఎస్‌తో పనిచేస్తుంది. ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో జీ95 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ ప్రాసెసర్‌కు కార్బన్‌ ఫైబర్‌ కూలింగ్ సిస్టంను అమర్చారు. దీని వల్ల ప్రాసెసర్‌ మంచి పనితీరుతో ఎక్కువ కాలం పనిచేస్తుందని రియల్‌మీ తెలపింది. ఈ ఫోన్‌లో ఐదు కెమెరాలు ఉన్నాయి. వెనక నాలుగు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనక వైపు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 8ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్ కెమరా, 2 మెగాపిక్సెల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం సోని లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు. సైడ్ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ ఫీచర్‌తోపాటు బ్యాటరీ ఛార్జింగ్ మానిటరింగ్ కోసం 8 సెన్సర్‌లను ఉన్నాయి.

ఇందులో 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 65 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో కేవలం 38 నిమిషాల్లో వంద శాతం ఛార్జింగ్ అవుతుందని కంపెనీ తెలిపింది. వైట్‌ నైట్, బ్లాక్‌ నింజా రంగుల్లో నార్జ్‌ 20 ప్రో లభిస్తుంది. 6జీబీ ర్యామ్‌/64జీబీ అంతర్గత మెమరీ వేరియంట్ ధర రూ. 14,999గాను, 8జీబీ ర్యామ్‌/128జీబీ ఇంటర్నల్ స్టోరేజి ధర రూ. 16,999గా కంపెనీ నిర్ణయించింది. సెప్టెంబరు 25 నుంచి ఫ్లిప్‌ కార్ట్‌, రియల్‌మీ.కామ్‌, ఎంపిక చేసిన స్టోర్లలో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.

డిస్‌ప్లే6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అల్ట్రా స్మూత్ (కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌)
ర్యామ్ 6జీబీ, 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్ 64జీబీ, 128జీబీ
ప్రాసెసర్ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో జీ95
ప్రధాన కెమెరా  48+8+2+2 మెగాపిక్సెల్
ముందు కెమెరా 16 మెగాపిక్సెల్
బ్యాటరీ  4500ఎంఏహెచ్ బ్యాటరీ (65వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10 + రియల్‌మీ యూఐ
సిమ్ సపోర్ట్డ్యూయెల్ సిమ్
కలర్స్వైట్ నైట్, బ్లాక్ నిన్జా
ధర6జీబీ ర్యామ్‌ + 64జీబీ = 14,999
8జీబీ ర్యామ్ ‌+ 128జీబీ= 16,999

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here