వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై తెలంగాణ హైకోర్టు స్పష్టత ఇచ్చింది. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టే ధరణి పోర్టల్‌కు సంబంధించి డిసెంబర్ 10 వరకు స్టే పొడిగించింది. ధరణి పోర్టల్‌కు సంబంధించి మూడు జిఓలపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సేకరించిన డేటాకు చట్టపరమైన రక్షణ ఉండాలని కూడా తెలిపింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తిగా నిలిచిపోయినందున గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని ఏజీ హైకోర్టును కోరారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ రిజిస్ట్రేషన్లు ఆపివేయాలని తామెప్పుడూ ఆదేశించలేదని.. పాతవిధానంలో కొనసాగించుకోవచ్చని ప్రభుత్వానికి తెలిపింది. అయితే ఆ వివరాలన్నీ ధరణి పోర్టల్‌లో నమోదు చేస్తామనే షరతు విధించి పాతవిధానంలో రిజిస్ట్రేషన్లు కొనసాగించుకోవచ్చని సూచించింది. విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది.(చదవండి: మరింత ప్రియం కానున్న టీవీ, ఫ్రిజ్‌ ధరలు)

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here