తెలంగాణ రేషన్ ‌కార్డుదారులకు తపాలాశాఖ శుభవార్త!

0

తెలంగాణ రాష్ట్రంలోని రేషన్‌కార్డుదారులకు తపాలాశాఖ శుభవార్త తెలిపింది. రేషన్ కార్డుదారులు వారి ‘ఐరిస్’, మొబైల్ నంబర్‌ను ఆధార్ కార్డులో అప్‌డేట్ చేసుకోవడానికి తపాలా సేవలు పొందవచ్చని తపాలాశాఖ పేర్కొంది. తెలంగాణలోని 28 జిల్లాల్లోని తపాలా కార్యాలయాల్లో 124 ఆధార్ కేంద్రాలతో పాటు మరో 15 మొబైల్ కిట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పోస్టుల శాఖ పేర్కొంది. మొబైల్ నంబర్‌ అప్డేట్ కోసం ₹50, ‘ఐరిస్ అప్‌డేట్ కోసం ₹100 చెల్లించాలి. అలగే మొబైల్ నంబర్, ఐరిస్ రెండింటి అప్డేట్ కోసం ₹100 చెల్లించాలి. రుజువు కోసం ఆధార్ కార్డు తప్పనిసరి.(చదవండి: డెబిట్ కార్డు లేకుండా ఎటిఎంలో డబ్బులు డ్రా చేయండి ఇలా?)

అలాగే ఆధార్ కార్డు A4 సైజ్ కలర్ ప్రింట్‌ కోసం రూ.30 చెల్లించాలి, 5-15 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలందరికి ఉచితంగా బయోమెట్రిక్ అప్డేట్ సేవలు పొందవచ్చు అని తెలిపింది. ఇంతక ముందు రేషన్‌ సరుకుల పంపిణీ కోసం బయోమెట్రిక్‌(వేలిముద్ర) తీసుకునే విధానం అమలులో ఉండేది. కానీ COVID-19 మహమ్మారి కారణంగా బయోమెట్రిక్ వ్యవస్థను నిలిపివేయడం, కొందరు వృద్దులకు సరిగా బయోమెట్రిక్ పనిచేయక పోవడంతో ఓటీపీ లేదా ఐరిస్‌ ద్వారా సరుకుల పంపిణీ ఈ నెల 1 నుంచి మొదలైంది. రేషన్ తీసుకునే సమయంలో ఆధార్‌ సంఖ్యకు లింకైన మొబైల్‌ నంబర్‌ అనుసంధానించి ఉంటేనే ఓటీపీ వస్తుంది. అందుకే ఈ సేవలను రేషన్ ‌కార్డుదారుల కోసం తపాలా శాఖ తీసుకొచ్చింది.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here