దేశ వ్యాప్తంగా డిజిటల్ లావాదేవిలను ప్రోత్సహించాడనికి ఆర్బిఐ మరో ముందడుగు వేసింది. నేటి(డిసెంబర్ 14) నుంచి రియల్ టైం గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్టీజీఎస్) ద్వారా 24 గంటల పాటు నగదు లావాదేవిలను నిర్వహించడానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ దేశంలో రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్(ఆర్‌టిజిఎస్) సౌకర్యం సోమవారం (డిసెంబర్ 14) తెల్లవారుజామున 12.30 గంటల నుంచి అమలులోకి వస్తునట్లు ట్విటర్ ద్వారా తెలిపారు. ఈ సౌకర్యం ఉన్న అతికొద్ది దేశాలలో భారత్ ఒకటిగా నిలిచింది అని అన్నారు.
ఇంకా చదవండి: 1140 కోట్ల బంపర్ లాటరీ గెలుచుకున్న దంపతులు
సంవత్సరంలో అన్ని రోజులలో ఆర్టిజిఎస్ సేవలు 24 గంటలు పాటు అందుబాటులో ఉంటుందని ఆర్బిఐ ప్రకటించింది. ఆర్టిజిఎస్ సేవల ద్వారా బ్యాంక్ పని గంటలు ముగిసిన తర్వాత కూడా ఆర్టీజీఎస్ లావాదేవీల స్థానంలో ఆటోమేటిగ్గా ఎస్టీపీ (స్ట్రైట్ త్రూ ప్రాసెసింగ్)ను ఉపయోగిస్తారని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కువ మొత్తంలో జరిగే లావాదేవిలకు ఆర్టీజీఎస్ సిస్టమ్‌ను ఉపయోగించేవారు. నేఫ్ట్ ద్వారా కేవల 2 లక్షల నగదు మాత్రమే బదిలీ చేసుకునే అవకాశం ఉండేది. గతంలో బ్యాంక్ పని దినాల్లో ఆర్టీజీఎస్ సేవలు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండేది. ఆర్టీజీఎస్ ద్వారా నగదు లావాదేవీలపై ఛార్జీల వడ్డనను 2019 జులైలో ఆర్బీఐ నిలిపేసింది. ఇప్పుడు అధిక మొత్తంలో లావాదేవిలను 24 గంటల పాటు జరపడానికి అవకాశం కల్పించింది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.
[…] ఇంకా చదవండి: బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త […]