స్మార్ట్ ఫోన్ లు వినోదం, ఇతరుల తోటి మాట్లాడుకోవడానికి మరియు ఇంటర్ నెట్ లో సమాచారం కొరకు మనకు భాగా సహాయపడుతున్నాయి, అయితే మనం రోజంతా ప్రతి చిన్న పనికి వాటిపై ఎక్కువగా ఆధారపడుతున్నాము. ఇలా రోజంతా ఫోన్ లో మనం గడపడం వలన మన బ్యాటరీ మీద చాలా ప్రభావం పడుతుంది. దీని వలన మన ఫోన్ యొక్క బ్యాటరీ సామర్థ్యం అనేది తొందరగా తగ్గిపోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 చిట్కాలు అనేవి మీ బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచుతాయి.(చదవండి: పరిమితం కానున్న గూగుల్ మీట్ సేవలు)
మీ మొబైల్ జీపీఎస్ మరియు బ్లూటూత్‌ను నిలిపివేయడం
అతిపెద్ద బ్యాటరీ డ్రైనర్లలో ఒకటి GPS లక్షణం(feature), దీన్ని మనకు అవసరం లేకున్నా ఆన్ చేయడం వల్ల బ్యాటరీ అనేది తొందరగా తగ్గిపోతుంది. మీరు ఈ ఫీచర్ ని వాడుకొనప్పుడు నిలిపివేయడం మంచిది. మీ ఫోన్ లో పైన ఉన్నా GPS సింబల్ ని నొక్కి ఆఫ్ చేస్తే చాలా మంచిది. అంతేకాకుండా మన మొబైల్ లోని Bluetooth అనేది కూడా బ్యాటరీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకోసం దీనిని కూడా ఆఫ్ చేయడం మంచిది.
బ్రైట్ నెస్ ని తగ్గించడం
స్మార్ట్‌ఫోన్‌లో ముఖ్యమైన వాటిలో ఒకటి ఈ డిస్ప్లే. డిస్ప్లే యొక్క బ్రైట్ నెస్ ఎక్కువగా ఉంటే అది మీ ఫోన్ బ్యాటరీని చాలా వరకు వినియోగిస్తుంది. కాబట్టి, బ్రైట్ నెస్ లెవెల్ అనేది చాలా ఎక్కువగా ఉండవలసిన అవసరం మీకు లేకపోతే, దాన్ని తగ్గించుకోవడం ద్వారా మన బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. లేకుంటే మీ మొబైల్ ఆటో డిస్ప్లే ఫీచర్ ని వాడటం మంచిది. దీన్ని కూడా మీ మొబైల్ టాప్ మెన్ లోకి వెళ్ళి బ్రైట్ నెస్ లెవెల్ తగ్గించుకోవచ్చు.(చదవండి: పరిమితం కానున్న గూగుల్ మీట్ సేవలు)
అవసరంలేని యాప్స్ ని తొలిగించడం
మనం చాలా సార్లు చిన్న చిన్న అవసరాలకు కూడా కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటాం. అయితే వీటిని ఆన్ ఇన్స్టాల్ చేయడం అనేది మర్చిపోతుంటాం. అందుకని మనం వెంటనే మొబైల్ అవసరం లేని యాప్స్ ని తొలిగించడంతో పాటు, మన బ్యాక్ గ్రౌండ్ లో రన్ అయ్యే యాప్స్ ని ఎప్పటికప్పుడు తొలిగించడం చాలా మంచిది. దీని ద్వారా మన మొబైల్ బ్యాటరీ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
ఆన్-డిస్ప్లే ఫీచర్ ని నిలిపివేయడం
మనం మన ఫోన్ ని ఆఫ్ చేసినప్పుడు లేదా పక్కన పెట్టినప్పుడు మన మొబైల్ స్క్రీన్ మీద మనకు చాలా యాప్స్ యొక్క నోటిఫికేషన్ లు కనిపిస్తాయి. అయితే ఇవి కూడా మొబైల్ యొక్క బ్యాటరీ సామర్థ్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉంటుంది. కావున మనం మనకు అవసరం లేని యాప్స్ యొక్క ఆన్ డిస్ప్లే ఫీచర్ నిలిపివేస్తే మంచిది.(చదవండి: పరిమితం కానున్న గూగుల్ మీట్ సేవలు)
లైవ్ వాల్‌పేపర్‌లు ఉపయోగించకపోవడం
లైవ్ వాల్‌పేపర్‌లు గురుంచి మనం తక్కువ మాట్లాడుకుంటే చాలా మంచిది. చాలా మొబైల్ కంపెనీ లు కూడా యూజర్ల దృష్టిని ఆకర్షించడానికి ఈ లైవ్ వాల్‌పేపర్ ఫీచర్ ని తీసుకొస్తున్నాయి. కావున మన మొబైల్ లైవ్ వాల్ పేపర్ ఫీచర్ ఆఫ్ చేస్తే చాలా మంచిది. దీని వల్ల మొబైల్ యొక్క బ్యాటరీ సామర్థ్యాన్ని చాలా వరకు పెంచుకోవచ్చు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని ఇప్పుడే Subscribe చేసుకోండి.