ప్రమాదంలో 70 లక్షల డెబిట్, క్రెడిట్ కార్డుదారులు

0

డెబిట్, క్రెడిట్ కార్డుదారులు చాలా ప్రమాదంలో ఉన్నట్లు భద్రత నిపుణుడు ఒకరు తెలిపారు. 70 లక్షల మంది భారతీయ డెబిట్, క్రెడిట్ కార్డుదారుల వివరాలు డార్క్ వెబ్‌లో లీక్ అయ్యాయని ఇంటర్నెట్ భద్రతా పరిశోధకుడు రాజ్‌శేఖర్ రాజహరియా ఇటీవల తెలిపారు. లీకైన వివరాలు 2జీబీ పరిమాణంలో గూగుల్ డ్రైవ్ లో ఉనట్లు తెలిపారు. వినియోగదారుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఇమెయిల్ చిరునామాలు, వార్షిక ఆదాయం, యజమాని సంస్థల వివరాలు వంటివి ఆ డ్రైవ్ లో ఉన్నట్లు రాజారియా తెలిపారు. ఈ డేటాలో 2010 మరియు 2019 మధ్య కాలానికి సంబంధించిన వినియోగదారుల సమాచారం ఉంది.(చదవండి: వ్యవసాయేతర ఆస్తుల రిజీస్ట్రేషన్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్)

ఇది ఫైనాన్షియల్ డేటా కాబట్టి, ఫిషింగ్ లేదా ఇతర దాడుల కోసం హ్యాకర్లు మరియు స్కామర్లకు ఇది చాలా విలువైనది అని రాజహరియా చెప్పారు. లీకైన వివరాలలో కార్డ్ నంబర్లు లేవు. క్రెడిట్ / డెబిట్ కార్డుల అమ్మకం కోసం బ్యాంకులు ఒప్పందం కుదుర్చుకున్న థర్డ్ పార్టీ సర్వీసు ప్రొవైడర్ల నుండి ఈ డేటా లీక్ అయ్యి ఉండవచ్చని ఇంటర్నెట్ భద్రతా పరిశోధకుడు పేర్కొన్నాడు. దీనిలో సుమారు ఐదు లక్షల మంది కార్డుదారుల పాన్ సంఖ్యలు ఉన్నాయి. ఏదేమైనా, 70 లక్షల మంది వినియోగదారుల డేటాను క్రాస్ చెక్ చేసిన పరిశోధకుడు చాలా వరకు ఖచ్చితమైనదిగా ఉన్నట్లు కనుగొన్నాడు. ఇంక్ 42 తెలిపిన నివేదిక ప్రకారం డార్క్ వెబ్‌లో బహిర్గతం చేసిన డేటా యాక్సిస్ బ్యాంక్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, కెల్లాగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మరియు మెకిన్సే అండ్ కంపెనీ ఉద్యోగులతో పాటు ఇంకొంత మందికి చెందిన డేటా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఉద్యోగుల వార్షిక ఆదాయం రూ .7 లక్షల నుంచి 75 లక్షల వరకు ఉంటుందని నివేదిక పేర్కొంది. ఫైనాన్షియల్ డేటా ఇంటర్నెట్‌లో అత్యంత ఖరీదైన డేటా అని రాజహరియా అన్నారు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here