ఆపిల్ ఐఫోన్ కోసం కిడ్నీ అమ్మేసిన యువకుడు

0

ఆపిల్ తన ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లను అక్టోబర్ 13న వర్చువల్‌లో ప్రారంభించిన తరువాత, నెటిజన్లు దాని గురించి మాట్లాడటం అపలేకపోతున్నారు. చాలా మంది దానిలో వచ్చిన కొత్త ఫీచర్స్ తో పాటు, ధర గురుంచి ఎక్కువగా చర్చిస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్ లో నెటిజెన్స్ ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లపై ఆసక్తికరమైన మీమ్స్ మరియు జోకులు పోస్ట్ చేస్తున్నారు. ఈ మొబైల్ ఫోన్ లను కొనడానికి బ్యాంక్ లకు కన్నా వేయడం లేదా మన మూత్ర పిండాలను అమ్ముకోవాల్సి ఉంటుంది అని కొందరు చమత్కరిస్తున్నారు. కానీ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఐఫోన్ కొనుగోలు కోసం చైనాలో వాంగ్ షాంగ్కు అనే యువకుడు 2011లో తన మూత్రపిండాలలో ఒకదాన్ని విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. తద్వారా తను కలలు కన్నా ఐఫోన్ 4, ఐప్యాడ్ 2 కొన్నాడు.

ఆ సమయంలో వాంగ్, తన మూత్రపిండాన్ని బ్లాక్ మార్కెట్లో సుమారు 4,500 ఆస్ట్రేలియన్ డాలర్లకు అమ్మకానికి ఉంచాడు. కానీ ఆ తర్వాత కొద్దికాలానికే మరో కిడ్నీ పనిచేయడం మానేయడంతో ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడతున్నాడు. అనారోగ్యంతో మంచంపట్టడంతో అందులోని ఆనందాన్ని ఆస్వాదించలేకపోయాడు. పైగా రెగ్యులర్‌గా డయాలసిస్‌(Dialysis) చేయించుకుంటే కానీ ప్రాణాలు నిలబడే అవకాశం లేదు. విచిత్రమేమిటంటే, వర్చువల్ విధానంలో కొనుగోలు చేయడం వల్ల దానిని కొన్న వ్యక్తి తెలియదు. ఇదిలా ఉండగా, తన కొడుకు బ్లాక్ మార్కెట్‌లో కిడ్నీ అమ్ముకున్నాడనే విషయం తెలుసుకున్న వాంగ్‌షాంగ్‌ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here