ఇంట్లో నుంచే 5 నిమిషాలలో మొబైల్-ఆధార్ లింక్!

0

మీరు వాడుతున్న మొబైల్ నంబర్‌‌ను మీ ఆధార్ నంబర్‌‌తో జత చేసుకోవాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతుంది. చాలా మంది ఆధార్ వినియోగదారులు ఈ లింకింగ్ ప్రక్రియ కోసం ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం చాలా రోజుల క్రితమే ఒక వెసులుబాటు కల్పించింది. ఇంటి నుంచే మీ మొబైల్ నంబర్‌కు ఆధార్ అనుసంధానం చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. ఐవీఆర్ పద్ధతి ద్వారా మీ ఫోన్ నుంచే ఈ ప్రక్రియను పూర్తిచేయొచ్చు. ఇది కొత్త ఆధార్ యూజర్లకు మాత్రమే.(ఇది చదవండి: అమెజాన్ వాలెంటైన్స్ డే క్విజ్ లో పాల్గొని రూ.50వేలు గెలుచుకోండి!)

  • మొబైల్ నుంచి టోల్ ఫ్రీ నెంబర్ 14546కు కాల్ చేయాలి.
  • భాషను ఎంచుకున్న తర్వాత ఆధార్ అనుసందానానికి సమ్మతి తెలియజేసేందుకు 1 నొక్కాలి.
  • ఆ తర్వాత ఆధార్ నెంబర్ ను నమోదు చేయాలి. దాన్ని దృవీకరించేందుకు 1 నొక్కాలి.
  • ఇప్పుడు మీ మొబైల్‌కి ఒక వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఇప్పుడు మీ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  • యూఐడీఏఐ డాటా బేస్ నుంచి మీ పేరు, ఫొటో, పుట్టినతేదీని మీ ఆపరేటర్ తీసుకోవడం మీకు సమ్మతమేనా కోరుతుంది.దాన్ని దృవీకరించాలి.
  • ఆ తర్వాత మనకు వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి. పూర్తయిన తర్వాత 1 నొక్కి పునః దృవీకరించాలి.
  • ఒకవేళ మీకు ఇంకో ఫోన్ నంబర్ ఉంటే 2ని ప్రెస్ చేసి మళ్లీ పైన పేర్కొన్న విధానం ద్వారానే దానికి కూడా ఆధార్‌ను లింక్ చేసుకోవాలి. ఈ సమయంలో మీ రెండో ఫోన్ నంబర్ కూడా ఆన్‌లో ఉండాలి. ఎందుకంటే దానికి కూడా ఓటీపీ వస్తుంది.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here