ఎమ్ఆధార్(mAadhaar) వినియోగదారులకు తీపికబురు

0

డిజిటల్ ఇండియాను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం 2017లో ఎమ్ఆధార్(mAadhaar) అనే యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వినియోగదారులు ‘ఆధార్ కార్డ్’ ప్రింట్ ఫార్మాట్ ను తమ వెంట ఉంచుకోవాల్సిన అవసరం లేదు. దీని ద్వారా మీ ఆధార్ వివరాలను హ్యాక్ చేయకుండా ఉండటానికి ప్రొఫైల్ కి లాక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తుంది. తాజాగా ఈ యాప్ కు UIDAI ఒక కొత్త అప్ డేట్ ను తీసుకువచ్చింది. ఈ కొత్త అప్ డేట్ ద్వారా ఐదుగురి ఆధార్ కార్డు ప్రొఫైల్‌లను ఇప్పుడుమీరు mAadhaar యాప్‌లో చేర్చే అవకాశం కల్పించింది.

ఈ విషయాన్ని యూఐడీఏఐ ట్వీట్ ద్వారా తెలిపింది. ఇంతకు ముందు mAadhaar యాప్‌లో గరిష్టంగా మూడు ప్రొఫైల్‌లను చేర్చుకునే అవకాశం ఉండేది. ఈ యాప్ వినియోగదారుల పేరు, పుట్టిన తేదీ, లింగం మరియు చిరునామా, ఫోటో, ఆధార్ నంబర్ లింక్‌లను కలిగి ఉంటుంది. ప్రొఫైల్ జత చేసే సమయంలో ఆ వ్యక్తి మొబైల్ కి ఓటీపీ వస్తుంది. మీరు కూడా గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ mAadhaa ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా వినియోగదారులు వారి ప్రొఫైల్‌ను కూడా అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here