Aitrtel Hikes Prepaid Tarrifs: ఎయిర్‌టెల్ తన సబ్‌స్క్రయిబర్లకు భారీ షాక్ ఇచ్చింది. టారిఫ్ రేట్లను ఒక్కసారిగా పెంచేసింది. ప్రీపెయిడ్ టారిఫ్‌లను 20 నుంచి 25 శాతం, డాటా టాప్‌అప్ ప్లాన్‌ల ధరలను 20 నుంచి 21 శాతం పెంచేసింది. ప్రతీ ప్యాక్ మీద కనీసం పది రూపాయల మినిమమ్ పెంపును ప్రకటించింది. గతంలోనే ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు భారీగా ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అనుకున్నట్లే నేడు భారీగా డేటా ప్లాన్ ధరలను భారీగా పెంచింది. ఆరోగ్యకరమైన ఆర్థిక పోటీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారతీ ఎయిర్‌టెల్ సోమవారం ప్రకటించింది.
(చదవండి: Multibagger: రూ.లక్ష పెట్టుబడితో 6 నెలల్లో రూ.60 లక్షలు లాభం)
28 రోజుల వాలిడిటీతో ఉన్న మినిమమ్ టారిఫ్ ప్రస్తుతం 79రూ. ఉండగా, అది రూ.99 కానుంది. ఇక డాటా టాప్‌అప్స్‌లో 48 రూ. అన్‌లిమిటెడ్ 3జీబీ డాటా ప్యాక్‌ను రూ.58లకు పెంచేసింది. నవంబర్ 26 నుంచి పెరిగిన ఈ ధరలు అమలులోకి రానున్నాయి. దీంతో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్(ARPU) రూ.200 నుంచి రూ.300 పెరుగుతుందని, ఈ లెక్కన ఆర్థికంగా నిలదొక్కుకునేందుకే టారిఫ్‌లను పెంచక తప్పలేదని భారతీ ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. భారతదేశంలో 5G స్పెక్ట్రమ్‌ను తీసుకొచ్చేందుకు ఇది సహాయపడుతుందని ఓ ప్రకటనలో ఎయిర్‌టెల్ పేర్కొంది. ఇక తాజా టారిఫ్ పెంపుదల నేపథ్యంలో #Airtel మీద సోషల్ మీడియాలో మీమ్స్ ద్వారా సెటైర్లు పేలుతున్నాయి.
