అమెజాన్‌లో రూ.96 వేల తోషిబా ఎయిర్ కండిషనర్ రూ.6 వేలకే!

0

TOSHIBA AC: అప్పుడప్పుడు ఈ-కామర్స్ కంపెనీలు ప్రత్యేక సేల్ పేరుతో చాలా తక్కువ ధరకే మంచి మంచి ప్రొడక్టులను సేల్ కు తీసుకొస్తుంటాయి. ఒక్కోసారి ఇది నిజమేనా ఆశ్చర్యపోతుంటాం. కానీ, ఈ సారి ఎటువంటి ఆఫర్ సేల్ లేకున్నా అమెజాన్ 2021 జూలై 5న రూ.96,700 తోషిబా ఎయిర్ కండిషనర్(ఎసీ)ను 94 శాతం డిస్కౌంట్తో రూ.5,900కు తీసుకొని వచ్చింది. ఈ ఆఫర్ ని చూసి చాలా మంది అదే రోజు కొనుకున్నారు. కానీ, అసలు విషయానికి వస్తే అమెజాన్‌లో తలెత్తిన చిన్న సాంకేతిక సమస్య కారణంగా రూ.59,000కు బదులుగా రూ.5,900కు తోషిబా 2021 రేంజ్ స్ప్లిట్ సీస్టమ్ ఎసీని సేల్ కి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

జూలై 5న అమెజాన్‌లో ఈ ఎయిర్ కండిషనర్ అసలు ధర రూ.96,700పై రూ.90,800 డిస్కౌంట్ ఇస్తున్నట్లు కనిపించింది. ప్రస్తుతం అమెజాన్‌లో అదే తోషిబా 1.8 టన్నుల 5-స్టార్ ఇన్వర్టర్ ఏసీ రూ.59,000కి లభిస్తుంది. దీని అసలు ధర కంటే 30 శాతం డిస్కౌంట్ తో ఇప్పుడు లభిస్తుంది. చాలా మంది మేము ఎందుకు ఈ అదృష్టాన్ని మిస్ అయినట్లు భావిస్తున్నారు. ఈ ఇన్వర్టర్ ఎసీ ఫీచర్స్ విషయానికి వస్తే దీనిలో యాంటీ బాక్టీరియల్ కోటింగ్, డస్ట్ ఫిల్టర్, డీహ్యూమిడిఫైయర్ ఉన్నాయి. తోషిబా ఎసీ కంప్రెసర్, పీసీబీలు, సెన్సార్లు, మోటార్స్, ఎలక్ట్రికల్ పార్టులపై 9 సంవత్సరాల అదనపు వారెంటీ లభిస్తుంది. ఎసీ 3.3 సీజనల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ రేషియో(ఎస్ఈఆర్)ని కలిగి ఉంది.

అమెజాన్ ఇలా తక్కువ ధరకే విలువైన ఉత్పత్తులను తీసుకొని రావడం ఇది మొదటిసారి మాత్రమే కాదు. 2019 ప్రైమ్ డే సందర్భంగా ఈ కామర్స్ దిగ్గజం రూ.9 లక్షల విలువైన కెమెరా గేర్ ను రూ.6,500కు తీసుకొని వచ్చి విక్రయించింది. అప్పుడు ఒక్కసారిగా ఈ ఆఫర్ గురుంచి ప్రజలు తెలుసుకోవడంతో దానిని కొనుగోలు చేయడానికి ఎగబడ్డారు. అయితే, ఈ లోపాన్ని గుర్తించిన అమెజాన్ ఆ ఆఫర్ ను నిలిపివేసింది. జూలై 5న కూడా అమెజాన్ లో తలెత్తిన చిన్న లోపం వల్ల రూ.59,000 లభించే ఏసీ రూ.5,900కి లభించింది.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here