శుక్రవారం, సెప్టెంబర్ 22, 2023

టీవీని స్మార్ట్ టీవీ‌గా మార్చే అమెజాన్ కొత్త ఫైర్ టీవీ స్టిక్స్ విడుదల

ఈ – కామర్స్ దిగ్గజం మార్కెట్ లోకి అమెజాన్ ఫైర్ టివి స్టిక్ (3వ జెన్) మరియు అమోజాన్ ఫైర్ టివి స్టిక్ లైట్ పేరుతో రెండు ఉత్పత్తులను విడుదల చేసింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత నాటి అమెజాన్ ఫైర్ టివి స్టిక్ (2వ జనరల్) ఓఎస్ రీడిజైన్‌తో పాటు కొత్త ఫైర్ టివి స్టిక్‌ను విడుదల చేసింది. గతంలో వచ్చిన ఫైర్ టీవీ స్టిక్ కన్నా ఈ కొత్త ఫైర్ టీవీ స్టిక్ అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. దీనితో యూజర్లు మరింత కంటెంట్‌ను యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాగా, ఫైర్ టీవీ ఓఎస్‌లో వీడియో కాల్ సపోర్ట్ మరియు యూజర్ ప్రొఫైల్‌ను సెట్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఈ కొత్త ఫైర్ టివి స్టిక్ పరికరాలు అక్టోబర్ 15 నుండి భారతదేశంలో విక్రయించబడుతాయి. ఇప్పటికే ప్రీ-ఆర్డర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్(3వ Gen) ధర రూ.3,999 కాగా, ఫైర్ టివి స్టిక్ లైట్ ధర రూ.2,999 గా ఉంది.(చదవండి: ముఖేష్ అంబానీ మరో సంచలన నిర్ణయం!)

అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ & స్టిక్ లైట్ ఫీచర్స్:

ఈ కొత్త ఫైర్ టీవీ స్టిక్ (3వ జెన్) డిజైన్ పాత ఫైర్ స్టిక్ డిజైన్ లాగే ఉంది.. డిజైన్ విషయంలో ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ స్ట్రీమింగ్ పరికరం టెలివిజన్ లేదా మానిటర్‌కు HDMI పోర్ట్‌ను ఉపయోగించి కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫైర్ స్టిక్ 1.7GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్ కలిగి ఉండటం వల్ల పాత ఫైర్ టివి స్టిక్ (2వ జెన్) కంటే 50 శాతం ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తుంది. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. ఈ రెండు ఫైర్ స్టిక్స్ డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ చేస్తాయి. దీని వల్ల స్పీకర్ల నుంచి నాణ్యమైన సౌండ్‌ను వినొచ్చు. అయితే ఈ డాల్బీ ఆట్మోస్ సపోర్ట్ కేవలం ఫైర్ టీవీ స్టిక్‌లో మాత్రమే ఉంది. ఇందులో 8GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. దీని ద్వారా అమజోన్ అలెక్సా కూడా వాడుకోవచ్చు. ఫైర్ టీవీ స్టిక్ ఫుల్ -హెచ్‌డి (1920×1080 పిక్సెల్స్) రిజల్యూషన్ వద్ద స్ట్రీమింగ్‌కు సపోర్ట్ చేస్తుంది మరియు ఇంకో ఆసక్తికర విషయం అమెజాన్ HDR10 + ఫార్మాట్ వరకు HDR స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉందని పేర్కొంది. హార్డ్‌వేర్ స్థాయిలో హెచ్‌డిఆర్‌కు 4కె వరకు సపోర్ట్ చేస్తుంది ఫైర్ టీవీ స్టిక్ (3వ జనరల్)లో డాల్బీ అట్మోస్ ఆడియోకు మద్దతు ఉంది.

అమెజాన్ ఫైర్ టివి స్టిక్ లైట్, ఫైర్ టివి స్టిక్ (3వ జెన్) కు సమానంగా పనిచేస్తుంది. ఫైర్ టీవీ స్టిక్ లైట్ 60fps ఫ్రేమ్ రేట్, HDR సపోర్ట్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉండి ఫుల్ హెడీ రిజల్యూషన్ స్ట్రీమింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కాగా ఫైర్ టీవీ ఓఎస్‌లో నూతన అప్డేట్‌ను కూడా తీసుకొచ్చింది అమోజాన్. ఈ నూతన అప్డేట్‌లో భాగంగా ఆరుగురు వ్యక్తులు తమ ప్రొఫైల్‌లను యాడ్ చేసుకోవచ్చు. స్క్రీన్ పైభాగంలో ఉన్న పాత ట్యాబ్‌లు ఇప్పుడు పోయాయి. దీనికి బదులుగా, నావిగేషన్ సౌకర్యంతో హోమ్, ఫైండ్, లైవ్ మరియు లైబ్రరీ ట్యాబ్‌లను జతచేశారు.(చదవండి: ముఖేష్ అంబానీ మరో సంచలన నిర్ణయం!)

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని ఇప్పుడే Subscribe చేసుకోండి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

Telugu