ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ క్రికెట్ అభిమానులకు శుభవార్త అందించింది. అమెజాన్ ప్రైమ్ లో క్రికెట్ లైవ్ స్ట్రీమింగ్ సర్విస్ ను తీసుకురానున్నట్లు పేర్కొంది. అమెజాన్ మరియు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మధ్య ఈ ఒప్పందం జరిగింది. 2021 చివరలో ప్రారంభమయ్యే వన్డే, టి 20, మరియు టెస్ట్ ఫార్మాట్లలో పురుషుల మరియు మహిళల క్రికెట్ కోసం న్యూజిలాండ్‌లో ఆడబోయే అన్ని అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లను ప్రసారం చేసే హక్కును ప్రైమ్ వీడియోకు దక్కించుకుంది. ఈ ఒప్పందం అనేది 2021 చివర్లో ప్రారంభం కాగా.. 2025–26 సీజన్ వరకు కొనసాగనుంది. ఒక ప్రధాన క్రికెట్ బోర్డు నుండి ప్రత్యేకమైన ప్రత్యక్ష క్రికెట్ హక్కులను పొందిన మొదటి భారతీయ స్ట్రీమింగ్ కంపెనీగా
అమెజాన్ ప్రైమ్ నిలిచింది.
అమెజాన్ ప్రైమ్ వీడియో డైరెక్టర్ & కంట్రీ జనరల్ మేనేజర్ గౌరవ్ గాంధీ మాట్లాడుతూ.. భారతదేశ అభిమానులు అమితంగా వీక్షించే క్రికెట్ ఆటను అమెజాన్ ప్రైమ్ లో తీసుకురావడానికి ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. “గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ప్రపంచ స్థాయి వినోదం కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో ఒక గమ్యస్థానంగా మారింది, అలాగే అమెజాన్ ఒరిజినల్ వెబ్ సిరీస్ లేదా అన్నీ భాషలలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలను అమెజాన్ ప్రైమ్ లో తీసుకువస్తునట్లు” అని గాంధీ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.