అమెజాన్ కొత్తగా తన మొబైల్ యాప్ లో అమెజాన్ క్విజ్ పేరుతో కొత్త ఆప్షన్ తీసుకొని వచ్చింది. కొందరు దీనిపై పాజిటివ్ గా స్పందిస్తే, మరికొందరు నెగెటివ్ గా స్పందిస్తున్నారు. నెగెటివ్ గా స్పందించే వారు ఒకటి గమనించాలి ఈ క్విజ్ ద్వారా మనకు వచ్చే నష్టం అయితే లేదు. దీనివల్ల ముఖ్యంగా మనకే చాలా వరకు లాభం. ఇది కాస్త సరదా కోసమో, ప్రచార వ్యూహంలో భాగంగానో అమెరికన్ ఇ–కామర్స్ కంపెనీ అమెజాన్ ‘డైలీ క్విజ్’ ప్రారంభించింది. ముఖ్యంగా చెప్పాలంటే మన మెదడుకు ఇది ఒక వ్యాయామంలాగా పని చేస్తుంది.(ఇది కూడా చదవండి: ఎమ్ఆధార్(mAadhaar) వినియోగదారులకు తీపికబురు)
మన అందరికీ ఏదైన ఒక ప్రశ్నకు కచ్చితంగా సమాధానం చెప్పాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా వరకు పోల్ ఆప్షన్ పేరిట ప్రతి వార్తా న్యూస్ చానెల్ లలో రన్ చేస్తారు. దీనివల్ల ప్రశ్నలకు కచ్చితంగా కచ్చితమైన సమాధానం చెప్పాలనే గట్టి పట్టుదల మాత్రం పెరుగుతుంది. వెయ్యిదారులు వెదికి అయినా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలనిపిస్తుంది. ఇక నాకు అంత సమయం ఎక్కడిది అనుకుంటే మన రోజు మొత్తంలో వృదా చేసే సమయంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ప్రతి రోజు 10నిమిషాలు సమయం కేటాయిస్తే చాలు. మనకు జ్ఞానంతో పాటు లక్షల విలువైన బహుమతులు ఆన్‌లైన్ క్విజ్‌లలో సొంతం చేసుకోవచ్చు. అయితే మన వెబ్ సైట్ ద్వారా అమెజాన్ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు ప్రతి రోజు సమాధానాలు తెలుసుకోవచ్చు.
అమెజాన్ క్విజ్‌లోకి ఎలా వెళ్లాలి?
- గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి అమెజాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- హోమ్‌పేజీలోకి వచ్చిన తరువాత: అమెజాన్ యాప్ మెనులో Programs and Featuresపై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మనకు క్రింద కనిపించే FunZone క్లిక్ చేస్తే అమెజాన్ క్విజ్ 8AM To 12PM కనబడుతుంది.
- అమెజాన్ క్విజ్ బ్యానర్‌లో ‘స్టార్ట్’ బటన్ నొక్కడంతో క్విజ్ మొదలవుతుంది.
- ఇక్కడ కనిపించే అయిదు ప్రశ్నలకు కరెక్ట్‌గా సమాధానం ఇస్తే ‘అమెజాన్ క్విజ్ విన్నర్స్ లక్కీ డ్రా’కు ఎంపిక అవుతారు.
- అందులో ప్రకటించిన తేదీలో విజేతల జాబితా ఇవ్వబడుతుంది.
ఐఫోన్, సోనీ పోర్టబుల్ పార్టీ సిస్టం, ఫాజిల్ స్మార్ట్‌వాచ్, శాంసంగ్ గెలాక్సీ నోట్… కొన్నిసార్లు ఇలా ఆకర్షణీయమైన బహుమతులు ఉంటాయి. గత నెలల విజేతల పేర్ల జాబితా కూడా చూడవచ్చు. అయితే మొదట్లో గిఫ్ట్ కోసమే అమెజాన్ క్విజ్‌లోకి ప్రవేశించిన ఆ తరువాత మాత్రం అదొక దినచర్యగా మారుతుంది చాలామందికి. అమెజాన్ మాత్రమే కాదు ఇండియన్ ఇ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లాంటి సంస్థలు కూడా ఆన్‌లైన్ ‘క్విజ్’ కాంటెస్ట్‌లు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా మనం డబ్బు కోసం కాకుండా ఒక గేమ్ లా భావించి అడితే మనకు అదృష్టం ఏ రోజైన వరించవచ్చు.(ఇది కూడా చదవండి: స్మార్ట్‌ఫోన్‌లో దీనికి ఏదైన అడ్డుపెడితే ఏం జరుగుతుందో తెలుసా?)
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.