అద్బుతమైన ఫీచర్స్ తో విడుదలైన Android 11 ఫైనల్ వెర్షన్

0

గత కొత్త కాలంగా బీటా దశలో ఉన్నా android 11 ఆపరేటింగ్ సిస్టమ్ చివరకి విడుదల చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం గూగుల్ పిక్సల్ తో పాటు, ఇతర కంపెనీ లకు చెందిన కొన్ని మొబైల్ ఫోన్లకు లభిస్తుంది. దానితో పాటు మరి కొన్ని రోజుల్లో అన్నీ ఫోన్లకు లభించే అవకాశాలు ఉన్నాయి. Android 10 తో పోలిస్తే android 11 లో చాలా కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో కొన్ని ఫీచర్స్ ఇలా ఉన్నాయి.

Android 11 ఫీచర్స్:

  • ఇందులో మన conversations కి సంబందించిన అన్నీ మెస్సేజ్ లు మనకు మన ఫోన్ స్క్రీన్ మీద కన్పిస్తాయి వాటిని మనం మన అవకాశనికి తగ్గట్లు పైకి కిందకు మార్చుకునే అవకాశం ఉంది.  
  • Facebook Messengerలో చాలా కాలంగా కనిపిస్తున్న Chat bubbles లాంటి సదుపాయం ఇప్పుడు Android 11లో అన్ని రకాల అప్లికేషన్లకు లభిస్తుంది. సంబంధిత అప్లికేషన్ ప్రత్యేకంగా ఓపెన్ చేయాల్సిన పనిలేకుండా ఈ సదుపాయం ద్వారా ఛాట్ కన్వర్జేషన్ చేసుకోవచ్చు.
  • అలాగే ప్రత్యేకంగా ఎటువంటి స్క్రీన్ రికార్డింగ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పనిలేకుండా, ఫోన్ తయారీ కంపెనీ కూడా తాము విడుదల చేసే ఫోన్లలో ప్రత్యేకంగా నేరుగా ఆపరేటింగ్ సిస్టంలోనే Screen Recorder సదుపాయం కల్పించబడుతోంది.
  • మనం మన స్నేహితులతో, బందువులతో మరియు ఇతరాలతో మెస్సేజ్ చేస్తున్నపుడు మనకు android 11 లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు కొన్ని suggestions అది అందిస్తుంది.  అలాగే emoji లు కూడా అందిస్తుంది.
  • మన రోజు వారి దినచర్యకు అనుగుణంగా కొన్ని యాప్ లను అందిస్తుంది. ఉదయం వ్యాయామం కోసం, సాయంత్రం వేలలో టెలివిజన్, ఎంటర్టైన్మెంట్ లాంటి యాప్ లను మీ స్క్రీన్ మీద చూపిస్తుంది. అలాగే మనం గమనిస్తే మన ఫోటోలకి సంబందించిన కెమెరా, గూగుల్ ఫోటోస్ లాంటి ఫోల్డర్స్ అన్నింటినీ మనకు ఒకే దగ్గర అందిస్తుంది.   
  • Iot(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) వినియోగం బాగా పెరిగిన నేపథ్యంలో మీ ఇంట్లో ఉన్న smart home లైట్లు, లాక్స్, కెమెరాలు వంటి వాటిని ప్రత్యేకంగా వాటికి సంబంధించిన అప్లికేషన్ ఓపెన్ చేయాల్సిన పని లేకుండా, నేరుగా పవర్ మెనూ ద్వారా వాటిని యాక్సెస్ చేయవచ్చు.
  • ఫోన్ లో ఏదైనా కొత్తగా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ అప్లికేషన్ కి శాశ్వతంగా పర్మిషన్స్ ఇవ్వడం కాకుండా, కెమెరా, మైక్రోఫోన్, లోకేషన్ వంటి వివిధ రకాల సెన్సార్లకి one-time permissionsని ఇచ్చే అవకాశం కూడా Android 11లో లభిస్తుంది.
  • మీ ఫోన్ లో ఇప్పటికే ఇన్స్టాల్ చేయబడి ఉన్న అప్లికేషన్స్ చాలా కాలం పాటు ఉపయోగించకపోతే వాటికి గతంలో కేటాయించబడిన పర్మిషన్స్ మళ్లీ తిరిగి వెనక్కి తీసుకునే విధంగా కూడా ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టం లో ఏర్పాటు ఉంటుంది.
  • ఫోన్ సెక్యూరిటీ విషయంలో కూడా ఎలాంటి లోపాలు లేకుండా బగ్స్ అన్నింటినీ తొలిగించడమే కాకుండా భద్రత విషయంలో చాలా జాగ్రతలు తీసుకొచ్చింది.
source: https://www.android.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here