తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్ అందించే ఇప్పుడు గూగుల్ క్రోమ్ యూజర్ల కోసం మరో అప్డేట్ ని తీసుకొచ్చింది. Android మరియు iOS యూజర్ల కోసం పాస్‌వర్డ్ భద్రతకి సంబందించి సెక్యూరిటీ అలర్ట్‌లను నోటిఫికేషన్ రూపంలో పంపిచనుంది. ఎప్పుడైనా మీ మొబైల్ లో ఉన్నా అకౌంట్ లకు సంబందించిన పాస్ వర్డ్ లు హ్యాకింగ్ గురైనప్పుడు వాటిని గుర్తించి మీకు వెంటేనే నోటిఫికేషన్ రూపంలో మీకు పంపిస్తుంది దీని ద్వారా మీరు పాస్‌వర్డ్‌లు హ్యాక్ అయ్యయో లేదో వెంటనే తనిఖీ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికే గూగుల్ వెబ్ బ్రౌజర్ డెస్క్టాప్ వెర్షన్లో అందుబాటులో ఉంది.(చదవండి: ఏపీ రైతులకు జగన్ ప్రభుత్వం శుభవార్త)
టెక్ దిగ్గజం గూగుల్ ఈ డేటా భద్రతను చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని తెలిపింది. ఈ ఫీచర్ అనేది మరింత సమర్దవంతంగా పని చేయడానికి యూజర్ల పేర్లు, ఐడిలు, పాస్ వర్డ్స్ ను గూగుల్ ఎప్పటికప్పుడు సర్వర్స్ కి పంపి విశ్లేషిస్తుంది. కానీ ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడ కూడా గూగుల్ తమ వినియోగదారుల పర్సనల్ డేటాను దాచుకోదు అని తెలిపింది. క్రోమ్ 86 బిల్డ్ అప్‌డేట్లో ఈ ఫీచర్‌ను అక్టోబర్ 6న ఆ సంస్థ ప్రకటించింది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.