కొత్త ఐఫోన్ సిరీస్‌ను లాంచ్ చేయడానికి “హై- స్పీడ్ పేరు”తో యాపిల్ మంగళవారం రాత్రి 10:30 గంటలకు ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన ఈవెంట్ లో ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో మరియు ఐఫోన్ 12 ప్రో మాక్స్ ఫోన్ లను ఆవిష్కరించింది. ఈ నాలుగు మోడళ్ళు కూడా 5జి సపోర్ట్‌తో వస్తాయి. COVID-19 మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం ఆపిల్ ఐఫోన్ 12 లాంచ్ అనేది ఆలస్యం అయింది. మరి ఆ ఐఫోన్ 12 మొబైల్స్ ఫీచర్స్ ఎలా ఉంటాయి, ధర ఎంత అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఫోన్ 12 మరియు ఐఫోన్ 12 ప్రో కోసం ప్రీ-ఆర్డర్లు అనేవి యుఎస్, యుకె, జపాన్, జర్మనీ, చైనా మరియు ఆస్ట్రేలియాలో అక్టోబర్ 23 నుండి విక్రయించబడటానికి అందుబాటులో ఉంటాయని తెలిపింది. భారతదేశం, దక్షిణ కొరియా మరియు మరో 12 దేశాలలో ఐఫోన్ 12 అక్టోబర్ 30 నుండి అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఐఫోన్ 12 మినహా మిగతా అన్ని మోడళ్ళు భారతదేశంలో ఎప్పుడు అందుబాటులో ఉంటాయో వివరించలేదు.
ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ ఫీచర్స్
ఆపిల్ ఐఫోన్ 12 మోడల్స్ డ్యూయల్ సిమ్ (నానో + ఇసిమ్) ఐఓఎస్ 14 తో పాటు కంపెనీ A14 బయోనిక్ ప్రాసెసర్‌తో నడుస్తాయి. అన్ని ఆపిల్ ఐఫోన్ 12 వేరియంట్లు ఆపిల్ యొక్క సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్ప్లే ప్యానెల్స్‌తో వస్తాయి. 2019 ఐఫోన్ శ్రేణిలని వచ్చిన ఐఫోన్ 11 అప్‌గ్రేడ్ చేసిన ఒఎల్‌ఇడి స్క్రీన్‌కు బదులుగా ఎల్‌సిడి ప్యానల్‌తో లాంచ్ అయినందున స్క్రీన్ యొక్క పనితీరు బాగుంటుంది. A14 బయోనిక్ ప్రాసెసర్ సరికొత్త ఐప్యాడ్ ఎయిర్‌లో అందుబాటులో ఉంది మరియు నాల్గవ తరం న్యూరల్ ఇంజిన్‌తో వస్తుంది.
A14 బయోనిక్ 4కె వీడియో ఎడిటింగ్ చేసుకవడానికి వీలుగా రూపొందించబడింది. ఇది ప్రస్తుతం ఉన్న A13 బయోనిక్ చిప్ కంటే CPU పనితీరులో 40 శాతం మరియు గ్రాఫిక్స్లో 30 శాతం మెరుగుదలని అందిస్తుందని పేర్కొన్నారు. ఇంకా, కొత్త 16-కోర్ న్యూరల్ ఇంజిన్ సెకనుకు 11 ట్రిలియన్ల వరకు ఆపరేషన్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. మునుపటి తరం న్యూరల్ ఇంజిన్ కంటే 10 శాతం వేగంగా యంత్ర అభ్యాస గణనలను అందించడానికి రెండవ తరం యంత్ర అభ్యాస యాక్సిలరేటర్లు కూడా CPU లో ఉన్నాయి. మెరుగైన ప్రాసెసింగ్ శక్తితో పాటు, 2020 ఐఫోన్ కుటుంబంలో వచ్చిన అన్నిటికీ 5జి సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫీచర్స్ అనేవి కొద్దిపాటి తేడాలతో అన్నీ ఐఫోన్ 12 సిరీస్ మొబైల్ లలో లభిస్తాయి.
ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ ధరలు:
మోడల్ | భారతదేశంలో ధర | అమెరికాలో ధర |
ఐఫోన్ 12 మినీ 64 జిబి | రూ. 69,900 | $ 699 |
ఐఫోన్ 12 మినీ 128 జిబి | రూ. 74,900 | $ 749 |
ఐఫోన్ 12 మినీ 256 జిబి | రూ. 84,900 | $ 849 |
ఐఫోన్ 12 64 జిబి | రూ. 79,900 | $ 799 |
ఐఫోన్ 12 128 జిబి | రూ. 84,900 | $ 849 |
ఐఫోన్ 12 256 జిబి | రూ. 94,900 | $ 949 |
ఐఫోన్ 12 ప్రో 128 జిబి | రూ. 1,19,900 | $ 999 |
ఐఫోన్ 12 ప్రో 256 జిబి | రూ. 1,29,900 | $ 1,099 |
ఐఫోన్ 12 ప్రో 512 జిబి | రూ. 1,49,900 | $ 1,299 |
ఐఫోన్ 12 ప్రో మాక్స్ 128 జిబి | రూ. 1,29,900 | $ 1,099 |
ఐఫోన్ 12 ప్రో మాక్స్ 256 జిబి | రూ. 1,39,900 | $ 1,119 |
ఐఫోన్ 12 ప్రో మాక్స్ 512 జిబి | రూ. 1,59,900 | $ 1,399 |
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.