ధరణి నిషేధిత భూముల జాబితా నుంచి మీ భూమిని తొలగించడం ఎలా..?

0
Dharani Prohibited Property List

తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది తీసుకొని వచ్చిన ధరణి పోర్టల్ నేటికీ లక్షలాది మంది రైతులు నానా కష్టాలు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ ఉదాసీనత రైతు జీవితాలపై ఉక్కుపాదం మోపుతున్నది. 1970 పీఓటీ ల్యాండ్ యాక్ట్ సెక్షన్‌ 22 ప్రకారం నిషేదించచబడిన భూ జాబితాలో పొరపాటున పట్టా భూములు కూడా చేర్చబడ్డాయి.

ఈ విషయంపై అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ ఒప్పుకున్నారు. ఈ పట్టా భూములను నిషేధిత జాబితా నమోదు చేస్తే వెంటనే తొలగిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ హామీ నెరవేరలేదు.

(చదవండి: మీరు ఉద్యోగస్తులా..! ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కొంటే భారీగా ట్యాక్స్‌ బెన్‌ఫిట్స్‌)

నిషేధిత భూముల జాబితాలోని పట్టాభూములను గుర్తించి న్యాయం చేయాల్సిన రెవెన్యూ ఉన్నతాధికారులెవరూ ఈ అంశంపై సమీక్షించడం లేదన్న విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. రైతులు కాళ్లకు ఉన్న చెప్పులు అరిగేలా తిరుగుతున్న పనులు కావడం లేదు.

ఈ క్రమంలో రైతుల ఆవేదన అరణ్యరోదనగా మారింది. సదరు భూములు అమ్మలేక, కొనలేక ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సిఎం కేసీఆర్‌కు రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దన్న ఉద్దేశ్యం ఉన్నప్పటికీ ధరణి పోర్టల్‌లో సాంకేతిక లోపాలను సవరించకుండా జాప్యం చేస్తుండడం విమర్శల పాల్దేస్తోంది.

అధికారులకు అర్ధం కావడం లేదు

ఒక్క సర్వే నంబరులోని పాక్షిక భూమిపై వివాదం ఉంటే మొత్తం విస్తీర్జాన్ని నిషేధిత జాబితాలో నమోదు చేసే గ్రేట్‌ సాఫ్ట్‌వేర్‌ వల్ల వేలాది మంది రైతులు ఇక్కట్లకు గురవుతున్నారు. పైగా పీఓటీలో నుంచి పట్టా భూములను తొలగించేందుకు పోర్టల్‌లో ఇచ్చిన ఆప్షన్‌ సక్రమంగా పని చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

అన్నింటికీ మించి మాడ్యూల్‌ను రూపొందించారు. కానీ దానికి సంబంధించిన మార్గదర్శకాలను కలెక్టర్లకు, రెవెన్యూ అధికారులకు ఇవ్వలేదు. దాంతో పోర్టల్‌లో దరఖాస్తులు వచ్చినా ఏ రూల్స్‌ ప్రకారం పరిష్కరించాలో జిల్లా స్థాయి అధికారులకు అర్ధం కావడం లేదు.

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఒక్కొక్కటి ఆప్పన్లు ఇస్తున్నారు. అన్ని సమస్యలకు ధరణి పోర్టల్‌లో మాడ్యూల్స్‌ ఇచ్చేశామని ప్రగతి భవన్‌లోని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ వాటికి రూల్స్‌రూపొందించడం లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

పోర్టల్‌ద్వారా వచ్చిన వేలాది దరఖాస్తుల పరిష్కారానికి కూడా నెలల సమయం పడుతోందని సమాచారం. పైగా రూల్స్‌లేకుండా దరఖాస్తులను పరిష్కరించడం ద్వారా ఏవైనా పొరపాట్లు తలెత్తితే తామే బాధ్యులమవుతామన్న ఆందోళన కూడా అధికారుల్లో ఉంది. మీ భూమిని ధరణి నిషేదిత భూముల జాబితా నుంచి తొలగించుకోడానికి ఈ క్రింద చెప్పిన విధంగా చేయండి.

ధరణి నిషేధిత భూముల(Prohibited Lands) జాబితా నుంచి మీ భూమి తొలగించడం కోసం ధరఖాస్తు చేసుకోండి ఇలా.

  • మొదట ధరణి పోర్టల్ ఓపెన్ చేయండి.
  • ధరణి పోర్టల్ లో ఉన్న TM15 Grievance Prohibited Lands ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీరు నిషేధిత భూముల(Prohibited Lands) జాబితా నుంచి భూమి తొలగించడానికి గల ఆధారాలను సాఫ్ట్ కాపీ రూపంలో దగ్గర పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత Click Here To Continue అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి పోర్టల్ లాగిన్ అవ్వండి.
  • మళ్లీ TM15 Grievance Prohibited Lands ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  • మీకు పీపీబీ పాస్ బుక్ ఉంటే Yes మీద క్లిక్ చేసి నెంబర్ నమోదు చేసి Fetch మీద క్లిక్ చేయండి, పీపీబీ పాస్ బుక్ ఉంటే లేకపోతే NO మీద క్లిక్ చేసి మీ జిల్లా పేరు, మండలం పేరు, గ్రామం పేరు, సర్వే నెంబర్, ఖాతా నెంబర్ నమోదు చేసి Fetch మీద క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత భూమి ఉన్న రైతు పేరు కనిపిస్తుంది. దానిని టిక్ చేసి ఎందుకు ఈ జాబితా నుంచి మీ భూమి తొలగించడానికి గల కారణాలను రాయండి.
  • మీ దగ్గర ఉన్న ఆధారాలను పోర్టల్ సబ్మిట్ చేయండి.
  • ఇప్పుడు మీకు ఒక నెంబర్ వస్తుంది దాని ద్వారా మీ ధరఖాస్తు స్టేటస్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here