చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. హైదరాబాద్‌లో అమ్మకాలు ఎప్పుడంటే?

0

ప్రముఖ ఆటో లిమిటెడ్‌ దిగ్గజం బజాజ్ హైదరాబాద్‌లో తన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే నాగ్‌పూర్‌లో చేతక్‌ ఈవీ షోరూమ్‌ ప్రారంభించేందుకు సిద్ధమైంది. నాగ్‌పూర్‌ తర్వాత చెన్నై, హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాలలో తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌తీసుకొనిరావడానికి బజాజ్‌ ప్లాన్‌ చేస్తుంది. ప్రస్తుతం బజాజ్‌ చేతక్‌ అర్బన్‌, ప్రీమియం వంటి వేరియంట్లలో లభిస్తుంది. చేతక్ అర్బన్‌ ధర రూ.1.42,620 ఉంటే ప్రీమియం ధర రూ.1,44,620గా ఉంది. దీనిలో 2 కిలోవాట్ బ్యాటరీలు అమర్చారు. ఈ బ్యాటరీలకు 3 ఏళ్లు లేదా 50,000 కి,మీ వారంటీని బజాజ్ అందిస్తుంది.

ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే డ్రైవ్ మోడ్‌ను బట్టి 85 నుంచి 95 కి.మీ వరకు ప్రయాణం చేయవచ్చు. బజాజ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు మార్కెట్‌లో ఇప్పుడు మంచి స్పందన వస్తోంది. మార్కెట్‌లోకి రాకముందే ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారానే బైకులన్నీ అమ్ముడైపోయేవి. తాజాగా నాగ్‌పూర్‌కి సంబంధించి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ మొదలైంది. 90వ దశకంలో స్కూటర్‌ విభాగంలో చేతక్‌ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బైకుల అమ్మకాలు పెరగడంతో చేతక్‌ స్కూటర్‌ అమ్మకాలు పడిపోయాయి. 2021 మార్చిలో ఒకేసారి దేశంలో 30 నగరాల్లో చేతక్‌ అమ్మకాలు ప్రారంభించాలని నిర్ణయించినా.. తర్వాత ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. క్రమంగా ఇప్పుడు ఒక్కో సిటీలో బజాజ్‌ షోరూమ్స్‌ ప్రారంభిస్తూ పోతుంది. మరికొద్ది రోజుల్లోనే హైదరాబాద్‌లో కూడా పరుగులు పెట్టనుంది చేతక్‌.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here