న్యూస్‌ ఛానళ్లకు టీఆర్‌పీ రేటింగ్‌ను నిలిపివేసిన బార్క్ ఇండియా

0

నకిలీ టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (టిఆర్‌పి) కుంభకోణం తరువాత, బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) గురువారం అన్నీ భాషల్లోని వార్తా ఛానెళ్ల రేటింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అన్నీ భాషలలో ని వార్తా ఛానెళ్లకు ప్రతివారం ఇచ్చే రేటింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్నా గణాంకాల/ప్రమాణాలను సాంకేతిక నిపుణల కమిటీతో సమీక్షించి వాటిని మరింత మెరగుపరచడానికి బార్క్.. 8 నుండి 12 వారాల పాటు వీక్లీ రేటింగ్ లను నిలిపివేస్తునట్లు పేర్కొంది. తప్పుడు టీఆర్‌పీలతో మోసలకు పాల్పడుతున్నట్టు ఆరోపిస్తూ మూడు ఛానెళ్లపై ముంబయి పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. రిపబ్లిక్‌ టీవీ సహా మరో రెండు మరాఠా ఛానళ్లు ఈ కుంభకోణానికి పాల్పడినట్లు నగర పోలీసు కమిషనర్ ఇటీవల తెలిపారు. ఇప్పటివరకు ఆయా ఛానళ్లకు చెందిన ఐదుగురిని అరెస్ట్‌ చేశారు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here